Posts

Showing posts from April, 2026

May 1st, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 30th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 28th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

జగిత్యాలలో పెట్రోల్ నిల్వలు పుష్కలం: కలెక్టర్ సత్యప్రసాద్

Image
 జగిత్యాలలో పెట్రోల్ నిల్వలు పుష్కలం: కలెక్టర్ సత్యప్రసాద్ బంక్ యజమానులతో అత్యవసర సమీక్ష.. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం! రైతులకు ఇబ్బంది కలగొద్దు.. ముందస్తుగా ఇండెంట్ పెట్టాలని ఆదేశం జగిత్యాల (బ్యూరో): జిల్లాలో పెట్రోల్ సరఫరా, నిల్వలపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జరిగిన ఈ భేటీలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, చమురు సంస్థల ప్రతినిధులు మరియు బంక్ యజమానులతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.  జిల్లాలోని అన్ని బంక్‌లలో ఉన్న నిల్వలు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న అమ్మకాల గణాంకాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా కొరత రాకుండా లోడింగ్ పెంచాలని చమురు సంస్థలను ఆదేశించారు. లాభాల కోసం పెట్రోల్‌ను అక్రమంగా నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిల్వల దృష్ట్యా ముందస్తుగానే కంపెనీలకు ఇండెంట్ పంపాలని సూచించారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా వ్యవసాయ వాహనాలకు పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉంచాలని, వ్యాపారస్తులకు అనవసరంగా...

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి -జగిత్యాల కలెక్టర్

Image
ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి - జగిత్యాల జిల్లా  కలెక్టర్ బి. సత్యప్రసాద్ పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య :63 ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపుకలెక్టర్ లు, ఆర్డీఓ లతో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.  అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 63 ఫిర్యాదులు, వినత...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జగిత్యాల జిల్లా ఎస్పీ

Image
 గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు పలు ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.

జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రారంభం

Image
 జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రారంభం - ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను సోమవారం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో స్వీయ గణనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్  మాట్లాడుతూ జనగణనను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన, రెండవ విడతలో జనాభా గణన నిర్వహిస్తారని వివరించారు. ఆధునిక డిజిటల్ సాంకేతికత ద్వారా ఖచ్చితమైన, పారదర్శకమైన డేటా సేకరణ జరుగుతుందని, ఇందుకోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.  జనగణన లో  భాగంగా ఈ నెల 26 నుండి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించబడిందని, ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.  అంతకుముందు జనాభా అధికారులు స్వీయ గణన చేసుకునే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.  కలెక్టర...

జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

Image
రాంనగర్‌లో కుటుంబ వివరాల నమోదు.. స్వీయ గణనలో పాల్గొన్న దత్తాత్రేయ తూఫాన్,హైదరాబాద్:- దేశ భవిష్యత్తు ప్రణాళికలకు, సుపరిపాలనకు ప్రాతిపదికగా నిలిచే 2027 జనగణన ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఆదివారం రాంనగర్‌లోని తన నివాసంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) దశను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్, ఈఆర్ఓ ప్రవీణ్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందానికి తన వివరాలను నమోదు చేయించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ జనాభా, ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు జనగణన అత్యంత కీలకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. "వనరుల సమాన పంపిణీకి, అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరడానికి ఖచ్చితమైన గణాంకాలు అవసరం. అందుకే తెలంగాణ ప్రజలందరూ జనగణన అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి, సరైన సమాచారాన్ని అందించాలి" అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు, ఇతర గణన అధికారులు పాల్గొన్నారు.   

ప్రకృతికి ఉన్న సమదృష్టియే హైందవ ధర్మం: సుందరకాండ శ్రీనివాస్ స్వామి

Image
తూఫాన్,హైదరాబాద్(చిక్కడపల్లి) :- హైందవ ధర్మం సర్వ మానవులను జీవులను సమానం గా చూడమని బోధిస్తుందని సుందర కాండ ప్రచారకుడు ఆధ్యాత్మిక వేత్త సుందరకాండ శ్రీనివాస్ స్వామి అన్నారు ప్రకృతి  కి ఉన్న సమ దృష్టి  హైందవ ధర్మం కు మూలం అని ఆయన చెప్పారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై హిందూసమ్మేళనం సంచాలన సమితి నిర్వహణలో  హిందూ సమ్మేళనం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ స్వామి మాట్లాడుతూ అఖండ భారత దేశ వేల సంవత్సరాల సంస్కృతి వారసత్వం కొనసాగించటం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంటి సంస్థలు పని చేస్తున్నాయి అని వివ రించారు సినీ నటి హరి కథా కళాకారిణి కరాటే కళ్యాణి మాట్లాడుతూ హైందవ మతం లో కులాల వారీ గా ప్రజలు చీలి పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు కుల రహిత సమాజం పతిష్ట కుటుంబ వ్యవస్థ స్వదేశీ భావన సంప్రదాయం అనుచరణ మాతృ దేశ భాష ల పట్ల అభిమానం ప్రతి భారతీయుడు ప్రాథమిక లక్షణం కావాలి అని చెప్పారు ఖాండవల్లి ఆదిత్య భరద్వాజ కీలక ప్రసంగం చేస్తూ అఖండ భారత దేశం అందరూ ఒక్కటి అన్న ఏకాత్మ భావన నేటి పరిస్థితి లో అత్యవసరం అని చెప్పారు సీనియర్ జర్నలిస్ట్ అఖిలేష్ సమ్మేళనం లక్ష్యాలు తెలిపారు ఈ సందర్...

ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు బసవతారకంక్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ క్యాంపు

Image
సోమాజిగూడా లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్  ఆధ్వర్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం ఆదివారం నాడు ప్రత్యేకంగా బసవతారకం కాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం కాన్సర్ స్క్రీనింగ్ కాంప్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఓరల్ స్క్రీనింగ్, చెస్ట్ ఎక్స్ రే,  మహిళల కోసం పాప్ స్మియర్,  బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మామోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్ (మెడ, పొట్ట, పొత్తి కడుపు) పరీక్షలు చేశారు. ఉచిత డాక్టర్ కన్సల్టెషన్స్, అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 150 మంది జర్నలిస్టులు ఈ పరీక్షలను చేయించుకున్నారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ తీసుకున్న ఈ ఇనిషియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు. చాప కింద నీటిలా బయట పడుతున్న కాన్సర్ ల విషయంలోటెస్టులే కీలకమని, అడగ్గానే ఈ కాంప్ నిర్వహించిన బసవతారకం హాస్పిటల్ డాక్టర్స్, ఇతర సిబ్బందికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్ వరికుప్పల, వైస్ ప్రెసిడెంట్ అత్తలూరి అరుణ, కోశాధికారి రమేష్ వైట్ల, జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈసీ మెంబెర్లు రచన ముడుంబై, రాజేశ్వరి కళ్యాణం కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారు.

మీడియా వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పెంచాలి - మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

Image
 మీడియా వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పెంచాలి  మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి  TOOFAN - MEDCHAL   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  మీడియా అక్రిడిటేషన్  కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డి ఆకాంక్షించారు.  శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరం లో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు జిల్లా అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, 252 జి ఓను అనుసరించి  నిబంధనలు పాటించాలని అన్నారు. అక్రిడిటేషన్  ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చూడాలని నియమ నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించి ముందుకు వెళ్లాలని సూచించారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చ...

April 26th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మీడియా అక్రిడీటేషన్ కమిటి

Image
 అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మీడియా అక్రిడీటేషన్ కమిటి TOOFAN - JAGTIAL : జగిత్యాల జిల్లాలోని నూతన జిల్లా మీడియా అక్రిడీటేషన్ కమిటీ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బిఎస్ లతను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి  పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటే షన్ కమిటీ సభ్యులకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బిఎస్ లత శుభాకాంక్షలు తెలిపారు.   DMAC కమిటీ సభ్యులు చీటీ శ్రీనివాసరావు, పి.ఎస్. రంగారావు, గంగుల రామ్ గోపాల్, ద్యావర సంజీవరాజు,   అబ్దుల్ ముజాహిద్ ఆదిల్, కర్నే సంతోష్, బి.సదాశివకుమార్ దొమ్మటి అంజు గౌడ్, వి. ప్రవీణ్ కుమార్, ఎస్ వేణుగోపాల్ కల్పన, విష్ణు  ఉన్నారు.   https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

బట్టి కార్మికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

Image
  బట్టి కార్మికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందజేసిన  డిప్యూటీ డిఎంహెచ్ఓ  TOOFAN - JAGTIAL : టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా నూకపల్లిలోని ఇటుక బట్టి కార్మికులకు, ప్రజలకు వైద్య శిబిరము నిర్వహించారు.నూకపల్లి ఇటుక బట్టి కార్మికులకు, ప్రజలకు స్పుటం కప్పులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ అందజేశారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డా ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా శ్రీనివాస్ మాట్లాడుతూ, క్షయ వ్యాధి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సలహాలను సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడటం, చాతిలో పట్టేసినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి తగు పరీక్షలు చేయించుకొని మందులు వాడాల్సిందిగా సూచించారు.ఈ వైద్య శిబిరంలో  వైద్యాధికారులు, వైద్య సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు.  https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి - జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్

Image
 గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి - జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్  TOOFAN- JAGTIAL :   తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా  ప్రారంభించిన భూసర్వే-రీ సర్వే సందర్భంగా బీర్ పూర్ మండలంలోని నేదునూర్ గ్రామంలో శనివారం రోజున భూముల రీ-సర్వేకు సంభందించిన అవగాహణ సదస్సు ( గ్రామ సభ) నిర్వహించారు.  భూమి రీ- సర్వే చేయుటలో చట్టం పరిదిలో వున్నా Survey and Boundary Act, 1923 గురించి మరియు సర్వే కార్యాక్రమాల గురించి, సర్వే చేయు పని విదానాల గురించి ఇట్టి గ్రామ సభలో నేదునూర్ గ్రామ రైతులకు మరియు గ్రామ ప్రజలకు అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, సర్వే & భూమి కొలతల అదికారి, బీర్ పూర్ తహశీల్దార్, మండల సర్వేయర్, మండల గిర్దావర్, RIలు &  స్థానిక పంచాయితీ కార్యదర్శులు, సంబంధిత GPOలు, స్థానిక సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పాలన అదికారి, నూతనముగా అనుమతి పొందిన సర్వేయర్, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.  https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ప్రారంభించిన ప్రభుత్వ విప్, కలెక్టర్

Image
TOOFAN - JAGTIAL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ  మన తెలంగాణ ప్రభుత్వం ప్రజపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అంబర్పేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల విస్తరణలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంబారిపేటతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది ప్రజలకు సానుభూతితో సేవలు అందించాలని సూచించారు. ఈ కేంద్రంలో అవుట్ పేషెంట్ సేవలు, ప్రసూతి సేవలు, టీకా కార్యక్రమాలు, ప్రాథమిక చికిత్సలు అందించబడతాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చ...

జగిత్యాల జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

Image
 TOOFAN - JAGTIAL :  జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధ్యక్షతన, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత సమక్షంలో ఐడీఓసీ (IDOC) కలెక్టరేట్, జగిత్యాల సమావేశ మందిరంలో శనివారం ఆర్డీవోలు, తహసీల్దార్లు మరియురెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న వివిధ రెవెన్యూ మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్షించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా సదాబైనామా కేసులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు (సదాబైనామా మరియు అసైన్డ్ భూములు మినహా), అసైన్డ్ భూముల వ్యవహారాలు, రీ–సర్వే గ్రామాలలో జీఐఎస్ ఆధారిత డిజిటైజేషన్, భూ భారతి పెండెన్సీ, ఫుల్ షేప్ అలియనేషన్ ప్రతిపాదనలు, మీ సేవా దరఖాస్తుల పెండెన్సీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ప్యాడీ కొనుగోలు పురోగతి, డిఫాల్టర్ రైస్ మిల్లర్లపై ఆర్.ఆర్. చట్టం ప్రకారం తీసుకున్న చర్యలు, ఇసుక నిర్వహణ, తడిబూముల నిర్వహణ, సి.ఏ. భూములు, అటవీ–రెవెన్యూ సంయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సంబంధిత అంశాలు మరియు అటవీ–రెవెన్యూ వివాదాలు గురించి సమీక్షించారు. ఇకపై ఎస్.ఐ.ఆర్. (ఎన్నికలు), జన...

April 25th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
     

April 24th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image

April 23rdd, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 22nd, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 21st, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 19th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 18th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 17th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 16th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 15th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

Image
- పి&టి కాలనీలో ఘనంగా అంబేడ్కర్ జయంతి  - నివాళులర్పించిన టి. గోపాల్ తూఫాన్, హైదరాబాద్ :- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంగా మలచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులూ టి. గోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని పి&టి కాలనీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టి. గోపాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందినప్పుడే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాచస్పతి, సత్యం దొనేటి, ఇల్లీ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ (బంటి), రవీందర్ గౌడ్, సురేష్, ఉల్లాస్ తదితర ప్రముఖులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాలనీలో పండగ వాతావరణం నెలకొంది.  

April 14th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 12th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

చీర్యాల నారసింహుడి చెంతకు పదండి.. నేటి నుంచే ‘అష్టాదశ’ బ్రహ్మోత్సవాలు!

Image
  చీర్యాల నారసింహుడి చెంతకు పదండి.. నేటి నుంచే  ‘అష్టాదశ’ బ్రహ్మోత్సవాలు!     ఏప్రిల్ 12 నుండి 15 వరకు కనుల పండువగా వేడుకలు..  14న స్వామివారి తిరుకళ్యాణం భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, నిత్య అన్నదానం..  ఆహ్వాన పత్రాలు అందుకున్న ప్రముఖులు కీసర / మేడ్చల్ (తూఫాన్ బ్యూరో):   ఆధ్యాత్మిక పరిమళాలతో కీసర మండలం చీర్యాల గ్రామం పులకించబోతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుండి 15 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ గారు భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక షెడ్యూల్ ఇదే: ఏప్రిల్ 12 (ఆదివారం): సాయంత్రం 5 గంటలకు చైర్మన్ లక్ష్మీనారాయణ నివాసం నుండి గ్రామమంతా స్వామివారి భవ్య ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం. ఏప్రిల్ 13 (సోమవారం): పంచామృత అభిషేకం, సుదర్శన నరసింహ యాగం, అఖండ జ్యోతి స్థాపన వంటి విశేష పూజలు. ఏప్రిల్ 14 (మంగళవారం): ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట రిటైర్డ్ ప్రధానార్చక...

April 11th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April10th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 9th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 8th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 7th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 5th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 4th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

జాతీయ స్థాయిలో వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీ కైవసం చేసుకున్న తెలంగాణ పోలీస్

Image
 జాతీయ స్థాయిలో వరుసగా మూడో ఏడాది  ‘ఓవరాల్ ఛాంపియన్’  ట్రోఫీ కైవసం చేసుకున్న తెలంగాణ పోలీస్  - విజేతలను అభినందించిన డిజిపి బి. శివధర్ రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 3 (తూఫాన్‌):  అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీస్ విభాగం సరికొత్త చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం, వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకుని అద్భుతమైన హ్యాట్రిక్ సాధించింది. ఈ సందర్భంగా విజేతలను, వారికి శిక్షణ నిచ్చిన అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.  రాష్ట్ర పోలీస్ విభాగం సాధించిన ఈ ఘనత తెలంగాణ కీర్తికిరీటంలో మరో మైలురాయిగా నిలుస్తుందని, అధికారుల అంకితభావం, క్రమశిక్షణే ఈ విజయానికి పునాదులని ఆయన ప్రశంసించారు. సిఐడి విభాగం ప్రత్యక్ష పర్యవేక్షణలో, నిరంతర శిక్షణతో రాటుదేలిన రాష్ట్ర బృందాలు ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో  అగ్రస్థానంలో నిలబెట్టాయి. 2023-24లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, 2024-25లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన పోటీల్లోన...

April 3rd, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image