Posts

Showing posts with the label #ckrishnayadav

శివాజీ స్ఫూర్తితో సాగాలి.. బాగ్ అంబర్‌పేట్‌లో కాషాయ రెపరెపలు

Image
 - ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. బైక్ ర్యాలీలో పాల్గొన్న గౌతమ్ రావు, కృష్ణ యాదవ్ తూఫాన్,హైదరాబాద్ :- బాగ్ అంబర్‌పేట్ డివిజన్ యువమోర్చా ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. యువమోర్చా డివిజన్ అధ్యక్షుడు రఘుచారి నేతృత్వంలో పోచమ్మ బస్తీలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, బస్తీలో ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. హైందవ ధర్మ రక్షణకు, స్వరాజ్య స్థాపనకు శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు శివాజీ మహారాజ్ జైకారాలతో హోరెత్తించారు. కాషాయ జెండాలతో సాగిన ఈ ప్రదర్శన స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ వ...