Posts

Showing posts from June, 2026

June 28th Sunday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 27th Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 26th Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు బండారు దత్తాత్రేయ వినతి

Image
  తూఫాన్, హైదరాబాద్‌: తెలంగాణలోని గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలపై ఒక వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ, పోడు వ్యవసాయ సమస్యల పరిష్కారం, 1/70 చట్టం సమర్థవంతమైన అమలు, పెసా (PESA) చట్టం అమలు వంటి అంశాలను గవర్నర్ దృష్టికి దత్తాత్రేయ తీసుకువెళ్లారు. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులందరికీ హక్కులు కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని కోరారు. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూ ఆక్రమణలు నిరోధించడానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఉపాధి కొరత తీర్చడానికి రాష్ట్ర గిరిజన సలహా మండలి (Tribal Advisory Council) ద్వారా తగిన చర్యలు చేపట్టాలని దత్తాత్రేయ కోరారు. గిరిజన సమాజ అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ...

June 25th Thursday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 24th Thursday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 24th Wednesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 23rd Day - Tuesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 21st Day - Sunday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 20th day - Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 19h day - Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 18th Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

జీడీపీ, వాణిజ్య గణాంకాలు మాత్రమే ప్రగతికి కొలమానం కావు: జీ-7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ

Image
- అభివృద్ధి ఎవరి కోసం.. ఎవరితో కలిసి.. ఏ దిశగా సాగుతోందన్నదే అసలైన ప్రశ్న - ఫ్రాన్స్ వేదికగా అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు - సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై జీ-7 దేశాల ప్రత్యేక దృష్టి  తూఫాన్, హైదరాబాద్ :- ప్రపంచ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి కేవలం జీడీపీ అంకెలు, దేశాల మధ్య జరిగే వాణిజ్య గణాంకాలకే పరిమితం కాకూడదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా బుధవారం నిర్వహించిన ఔట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 'అందరికీ సమతుల్య, భాగస్వామ్య మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ' అనే అంశంపై జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ఆయన తన గళాన్ని బలంగా వినిపించారు. అంతర్జాతీయ వేదికపై మానవతా దృక్పథంతో కూడిన ప్రగతిని కాంక్షిస్తూ ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు.   ఫ్రాన్స్ జీ-7 అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణంలో.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యమైన ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం అభినందనీయమని ప్రధాని మోదీ కొనియ...

ఆరుట్లలో అంతర్జాతీయ స్థాయి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం

Image
- ప్రభుత్వ బడుల 27 లక్షల మంది విద్యార్థులకు అంకితం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం.. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన సీఎం - రైతు బిడ్డలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం   తూఫాన్, హైదరాబాద్ :- రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఆదర్శ పాఠశాల ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించేలా ఈ పాఠశాలను సకల వసతులతో తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం పాఠశాల ఆవరణ అంతా తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఇదే వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం ‘బ్రేక్‌ఫాస్ట్’ (అల్పాహారం) పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటిస్తూ అల్పాహారం తీసుకున్నారు. వంటగదిలో...

ఐటీ కారిడార్‌లో గ్లోబల్ టచ్.. అమెరికా కాన్సులేట్ రోడ్డు ఇకపై 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'

Image
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీల్లో కార్పొరేట్ దిగ్గజాల పేర్లతో రహదారులు, కూడళ్లు   - గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్.. రతన్ టాటా పేరుతో మౌలిక వసతులు   - హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తూఫాన్, హైదరాబాద్ :- విశ్వనగరం హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిని, గ్లోబల్ గుర్తింపును మరింత పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ప్రముఖ రహదారులు, ప్రధాన కూడళ్లకు ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ ప్రముఖుల పేర్లు పెట్టాలని సంకల్పించింది. ఇందులో భాగంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (యూఎస్ కాన్సులేట్) పక్కన ఉన్న ప్రధాన రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   హైదరాబాద్ నగరం గ్లోబల్ ప్రొఫైల్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోనే ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఈ నామకరణ నిర...

లక్నోలో భారత్, అఫ్గాన్ వన్డే సమరం

Image
- సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా.. పుంజుకోవాలని చూస్తున్న అఫ్గానిస్థాన్  తూఫాన్, హైదరాబాద్ :- భారత్,అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.  టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లతో కూడిన భారత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి వన్డేలో అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీ (102) చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకుని సిరీస్ రేసులో నిలవాలని అఫ్గాన్ భావిస్తోంది.  లక్నో పిచ్ సంప్రదాయబద్ధంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను...

గచ్చిబౌలిలో 'ఓజ్రిట్' నూతన కార్యాలయం ప్రారంభం

Image
తూఫాన్, హైదరాబాద్ :- ప్రముఖ సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల సంస్థ 'ఓజ్రిట్ డాట్ కామ్' (Ozrit.com) గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తన నూతన విభాగాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జ్యోతి ప్రజ్వలన చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సంస్థలోని యువ సాంకేతిక నిపుణులు, ఉద్యోగులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. వారి పనితీరును, నూతన ఆవిష్కరణలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓజ్రిట్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ భరత్ గుప్తా, సహ వ్యవస్థాపకుడు, సీఓఓ వివేకానంద్ రెడ్డిలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, ఐటీ రంగంలో వస్తున్న నూతన మార్పులపై చర్చించారు.  

అమెరికా లేకుంటే ఇజ్రాయేలే లేదు: డోనాల్డ్ ట్రంప్

Image
- నెతన్యాహుపై నిప్పులు చెరిగిన యూఎస్ అధ్యక్షుడు - జీ-7 సదస్సు వేదికగా ఖతార్ అమీర్‌తో భేటీలో సంచలన వ్యాఖ్యలు తూఫాన్, హైదరాబాద్ :- "అమెరికా అండ లేకపోతే అసలు ఇజ్రాయేల్ అనే దేశమే ఉండేది కాదు. ముఖ్యంగా నేను లేకుంటే ఇజ్రాయేల్‌కు మనుగడే లేదు. ఎందుకంటే ఆ దేశం కోసం నేను చేసిన సాహసోపేత నిర్ణయాలు మరే ఇతర అమెరికా అధ్యక్షుడు కూడా చేయలేదు" అని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ-7 సదస్సు వేదికగా మంగళవారం ఆయన ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సదస్సు మార్జిన్స్‌లో ఖతార్ అమీర్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఇజ్రాయేల్ ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాలను ఎవరూ తీసుకోలేరని, కానీ ప్రస్తుత ఇజ్రాయేల్ నాయకత్వం దాన్ని విస్మరిస్తోందనే కోణంలో ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం, గాజాలో శాంతి స్థాపన మరియు బందీల విడుదల అంశాలపై ఖతార్ అమీర్‌తో సుదీర్ఘంగా చర్చించిన ట్రంప్.. నెతన...

విద్యా రంగంలో సరికొత్త విప్లవం: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’

Image
- ఆరుట్లలో తొలి పాఠశాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి - కార్పొరేట్ స్థాయి వసతులతో నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య - పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు స్కూళ్లు.. దశలవారీగా వందకు పెంపు తూఫాన్, హైదరాబాద్ :- రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ (టీపీఎస్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరుట్లలో నిర్మించిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేసింది. అత్యాధునిక వసతులు.. ఇంగ్లీష్ మాధ్యమం: ఈ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన సాగనుంది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అత్యాధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ సెంటర్లు, విశాలమైన లైబ్రరీలతో పాటు క్రీడా మైదానాలను ఇక్కడ అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు ప...

June 17th Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

హనుమంతరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బండారు దత్తాత్రేయ

Image
- ఆయురారోగ్యాలతో మరెన్నో ఏళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష  తూఫాన్, హైదరాబాద్:- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతరావు నివాసానికి వెళ్లిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు అభినందనలు అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... హనుమంతరావు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఆయన సుదీర్ఘ కాలంగా అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

June 16th Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

అంబర్‌పేటలో బీజేపీ నియోజకవర్గ సమావేశం

Image
తూఫాన్ హైదరాబాద్ :-  అంబర్‌పేట నియోజకవర్గ బీజేపీ సమావేశం అదివారం ఉదయం 11 గంటలకు చె నంబర్ చౌరస్తాలోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. వారితో పాటు జిల్లా ప్రభారి వీరెల్లి చంద్రశేఖర్, తెలంగాణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జి.ఆనంద్ గౌడ్, సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి, సెంట్రల్ జిల్లా జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్‌లతో పాటు వివిధ విభాగాల డివిజన్ అధ్యక్షులు, మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పెద్ద సంఖ్యలో మహిళా నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.

June 14th Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

ఏషియన్ పెయింట్స్ 'యాంటీ-డాంప్ టెక్నాలజీ' ఆవిష్కరణ

Image
- వాటర్-మార్క్ సమస్యకు ఇకపై చెక్ ​ - ఎకానమీ విభాగంలో నాలుగేళ్ల వారంటీ కూడా..  తూఫాన్, హైదరాబాద్ :- ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు అందంగా, సౌకర్యవంతంగా, ఏళ్ల తరబడి మన్నికగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఎకానమీ పెయింట్ విభాగంలో (అందుబాటు ధరల్లో ఉండే రంగులు) ఇవన్నీ ఉండే ఉత్పత్తులు చాలా వరకు కష్టమే. వీటన్నింటిలోనూ అత్యంత సాధారణమైన సమస్య గోడలపై వచ్చే నీటి మరకలు (వాటర్ మార్క్స్). ఇది ఇంటి అందాన్ని మెల్లగా దెబ్బతీస్తుంది. దీనిని గుర్తిస్తూ, ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఏషియన్ పెయింట్స్ 'ఏస్', 'ట్రాక్టర్ ఎమల్షన్ల'లో 'యాంటీ-డాంప్ టెక్నాలజీ'ని ఆవిష్కరించింది. అద్భుతమైన పనితీరు, ఆకర్షణీయమైన లుక్‌తో ఈ ఎకానమీ రేంజ్ ఉత్పత్తులపై నాలుగేళ్ల వారంటీని కూడా ఇస్తుంది. ఏషియన్ పెయింట్స్ అత్యంత నమ్మకమైన, విస్తృతంగా ఉపయోగిస్తున్న బ్రాండ్లలో ఒకటైన 'ఏస్', 'ట్రాక్టర్ ఎమల్షన్లు' ఎకానమీ విభాగంలో నాణ్యతను, విలువను అందించడం ద్వారా ఇంటి యజమానులు, డీలర్లు, కాంట్రాక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసం ఈ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో నిరంతరం కొత్త ఆవిష్కరణలను పరిచయం చే...