బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన ఒక అధ్యయన కమీటీ - మంత్రి కెటి రామారావు Ø ఈ కమీటీలో ఇందన, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు మైన్స్, టియస్ యండిసి, సింగరేణి అదికారులు Ø నెల రోజుల్లో నివేధిక ఇవ్వనున్న కమీటీ Ø ఇందన శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఉన్నత స్ధాయి ఉమ్మడి సమావేశం Ø బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న మంత్రులు Ø రాష్ర్ట పునర్విభన చట్టంలో పెర్కోన్న మేరకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన భాద్యత కేంద్రం పైన ఉన్నదని, కానీ గత నాలుగు సంవత్సరాలుగా కాలం వెళ్లదీస్తున్నది తప్ప కేంద్రం ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు Ø బయ్యారం ప్లాంట్ ఏర్పాటు అవసరం అయిన అన్ని విధాలుగా సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉన్నది Ø ఏవిధంగా చూసిన బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుకు అనేక సానూకూలాంశాలున్నాయని, కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సానూకూల నిర్ణయమే అన్న మంత్రులు Ø బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా, రాకున్నా ప్లాంటు ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుంది బ...