Posts

Showing posts from December, 2025

Happy New Year 2026

Image
తూఫాన్ తెలుగు దినపత్రిక తరుపున అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు....!!!  #happynewyear #newyear2026 #2026 #toofandaily #toofantv #toofantvnews

January 1st, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

ముక్కోటి వేళ.. 'గోవింద' నామస్మరణ

Image
-  ఉత్తర ద్వార గుండా వేంకటేశ్వరుడిని దర్శించుకున్న బండారు దత్తాత్రేయ - చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవస్థానంలో భక్తుల కోలాహలం తూఫాన్ - చిక్కడపల్లి (హైదరాబాద్) :- వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న దత్తాత్రేయకు అర్చకులు, దేవస్థాన కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ముక్కోటి ఏకాదశి విశిష్టతను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ద్వారం) ద్వారా ఆయన స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందజేశారు. దర్శనం అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం శుభసూచకమని, తెలుగు ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచ...

కాలుష్య రహిత హైదరాబాద్ మహానగరమే లక్ష్యం

Image
 కాలుష్య రహిత హైదరాబాద్ మహానగరమే లక్ష్యం • ఆ దిశగా పూర్తిస్థాయి ప్రక్షాళన • నెలకు మూడు రోజులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్  • ప్రతీ పదిరోజులకు గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్  • కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాన రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా  తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (CURE) ఏరియాను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే క్యూర్( CURE) పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని, పరిపాలన...

జీవో 252లో కొన్ని సవరణలు చేయండి

Image
 జీవో 252లో కొన్ని సవరణలు చేయండి  -మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన   జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జీవో పై చర్చించడంతో పాటు వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తమ సంఘం ముఖ్యుల సమావేశం, 252జీవో ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, జర్నలిస్టుల నుండి వ్యక్తం అవుతున్న అభ్యంతరాలు, జీవో లో లోటుపాట్లపై చర్చించి, కొన్ని సవరణలు అవసరమనే అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రితో తెలిపారు. గతంలో అక్రెడిటేషన్ కార్డులతో డెస్క్ జర్నలిస్టులందరికీ కాకుండా కొందరికి మాత్రమే న్యాయం జరిగేదని, ప్రస్తుతం అలా కాకుండా బస్ పాస్ లతో సహా ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్...

December 30th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షర జాతరకు రికార్డు నీరాజనం!

Image
  ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్.. 16 లక్షల మందితో సరికొత్త చరిత్ర - సెల్ ఫోన్ల కంటే పుస్తకాలకే యువత మొగ్గు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి - రాజ్యాంగాన్ని ‘పాకెట్ సైజు’లో సామాన్యులకు అందించాలి తూఫాన్(హైదరాబాద్) :-  హైదరాబాద్ నగరం నడిబొడ్డున 11 రోజుల పాటు సాగిన అక్షరాల పండుగ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ రికార్డు స్థాయి సందర్శకులతో ముగిసింది. ముగింపు సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భారత రాజ్యాంగాన్ని పాకెట్ సైజులో సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సెల్ ఫోన్లు, సినిమాలకు దూరంగా యువత ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం సమాజ మేధో అంతర్మథనానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి వాసు వార్షిక నివేదికను సమర్పిస్తూ.. గత ఏడాది 12 లక్షల మంది రాగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 16 లక్షలకు చేరుకుందని, అందులో 70 శాతం మంది యువతే ఉండటం విశేషమని వెల్లడించారు. 368 స్టాళ్లతో సాగిన ఈ మేళాను ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఒక 'మిలియన్ మార్చ్'గా అభివర్ణించగా, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె...

మాండలిక భాషలోనే వాస్తవిక కథలు రావాలి... Session - 2

Image
పిల్లలకు నిత్య జీవిత వాస్తవాలను పరిచయం చేయాలి..... హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో జరిగిన  "Different Childhoods, Different Tales" చర్చ కార్యక్రమంలో వక్తల పిలుపు తూఫాన్(హైదరాబాద్) :- 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో భాగంగా అనిశెట్టి రజిత వేదిక పై ఆదివారం సాయంత్రం... రెండవ సెషన్ లో భాగంగా Different Childhoods, Different Tales చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి  డా.అస్మా రషీద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. డా.షెఫాలీ ఝా, డా.గోగు శ్యామల, కనీజ్ ఫాతిమా, డాక్టర్ మధు మిత సిన్హా, డా.ఉమా భృగుబండ మాట్లాడారు.కార్యక్రమానికి అస్మా ఫాతిమా moderator గా వ్యవహరించారు. షెఫాలీ ఝా ప్రసంగిస్తూ, బాల్య స్మృతులే మనిషి వ్యక్తిత్వానికి పునాది వేస్తాయని, పుస్తక జ్ఞానాన్ని సామాజిక సేవతో ముడిపెట్టినప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. తన చిన్నతనంలో దర్గా ఆవరణలోని చింత చెట్టు కింద ఆడుకుంటూనే, అక్కడి మసీదు వెనుక ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలికి (ఖాలా) సహాయం చేసిన తీరును గుర్తుచేసుకుంటూ.. ఆనాటి సామాజిక అనుభవాలే తనలో మానవత్వాన్ని పెంపొందించాయని వివరించారు. ‘స్వేచ్ఛ’ వంటి నవలలు గుర్తింపునిస్తే,...

భారత భద్రత.. రాజీలేని పోరాటం....

Image
 'ఆపరేషన్ సింధూర్' మన దృఢ సంకల్పానికి నిదర్శనం: ప్రధాని మోదీ కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో "మన్ కీ బాత్" వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులూ... తూఫాన్(హైదరాబాద్) :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన్ కీ బాత్' 129వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని, పార్టీ శ్రేణులు, స్థానిక పారిశుధ్య కార్మికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా 2025 ఏడాదిని భారతావనికి జాతీయ గర్వకారణమైన సంవత్సరంగా ప్రధాని అభివర్ణించారు. దేశ భద్రత, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట దేశ రక్షణలో భారత్ రాజీలేని పోరాట పటిమను ప్రదర్శిస్తోందని, 'ఆపరేషన్ సింధూర్' ద్వారా మన జాతీయ భద్రతా దృఢత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని ప్రధాని పేర్కొన్నారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి దేశభక్తిని మరోసారి ప్రధాని స్మరించుకున్నారు. అలాగే 'తమిళం నేర్చుకుందాం - తమిళ కరకలం' చొరవ ద్వారా భాషా వైవిధ్యం, సాంస్కృతిక ఐక్యతను పెంపొ...

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

Image
  38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘పుస్తక స్ఫూర్తి’పై మేధోమథనం వచ్చే ఐదేళ్లలో అప్పులు లేని సమాజమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు తూఫాన్(హైదరాబాద్) :- అక్షరం మనిషిని ఆలోచింపజేస్తుందని, పుస్తకం జీవితానికి కొత్త దిశను చూపే దారిదీపమని పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ‘అనిశెట్టి రజిత’ వేదికపై ‘పుస్తక స్ఫూర్తి - పుస్తకం ఒక దారిదీపం’ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని వక్తలను సన్మానించారు. కోటి రూపాయలతో పుస్తకాల పంపిణీ: మంత్రి జూపల్లి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో పఠనాసక్తిని పెంచేందుకు తమ శాఖ తరపున  కోటి రూపాయల  వ్యయంతో స్ఫూర్తిదాయక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్...

డెస్క్ జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం

Image
బస్ పాస్ లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తింపజేయిస్తాం అవాస్తవాలతో కొందరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు -టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ  తూఫాన్(హైదరాబాద్) :-   జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి  స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్ పాస్ లతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్...

మనసుకు శాంతిని, సమాజానికి మేధావిని ఇచ్చేది పుస్తకమే....

Image
 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తూఫాన్(హైదరాబాద్):- పుస్తక పఠనం అభ్యాసమైతే అది మనిషికి మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, గొప్ప మేధావిగా తీర్చిదిద్దుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో నిర్వహించిన ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. విద్యార్థులు ప్రతి స్టాల్‌ను సందర్శించి తమకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవాలని సూచించారు. పఠనం అనేది కేవలం సమాచారం కోసమే కాకుండా, మెదడుకు పదును పెట్టి విజ్ఞానాన్ని, ఆనందాన్ని పంచుతుందని చెప్పారు. తన జీవిత ప్రయాణంలో ‘నెపోలియన్ ది గ్రేట్’ పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆయన నిఘంటువులో ‘అసాధ్యం’ అనే పదమే లేదన్న స్ఫూర్తితోనే తాను సమాజ సేవలో నిమగ్నమయ్యానని దత్తాత్రేయ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పుడు భగవద్గీత తనకు జీవిత పరమార్థాన్ని బోధించిందని, కోవిడ్ వంటి విపత్కర కాలంలో మహాభాగవతం చదవడం వల్ల మానసిక ధైర్యం, శక్తి లభించాయని గుర్తుచేసుకున్నారు. నేటికీ తాను రాత్రి వేళల్లో పఠనానికి సమయం కేటాయిస్తానని చెబుతూ.. మనం ఎంత ఎక్కువగా చదివితే అంత వినమ్రత పె...

December 28th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అంబర్‌పేటలో ఘనంగా వీర్ బాల్ దివస్....

Image
 సిక్కు గురువుల త్యాగాలను స్మరించుకున్న నేతలు 6 నంబర్ చౌరస్తా నుంచి అలీ కేఫ్ వరకు భారీ ప్రదర్శన తూఫాన్(హైదరాబాద్):- సిక్కు మత పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్‌ల వీరోచిత త్యాగాలను స్మరిస్తూ అంబర్‌పేటలో గురువారం రాత్రి 'వీర్ బాల్ దివస్' వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక 6 నంబర్ చౌరస్తా నుండి అలీ కేఫ్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో నాయకులు, సిక్కు సామాజిక వర్గ ప్రతినిధులు మషాల్ (కాగడాలు), కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్మరణలో రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, నాయకులు దీపక్ రెడ్డి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే మతం కోసం, ధర్మ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సాహిబ్‌జాదాల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. వారి ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కదిలివచ్చిన శ్రేణులు.. భక్తిశ్రద్ధలతో ర్యాలీ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓఎస్ రెడ్డి, అజయ్ కుమార్, నేతలు కర్ణె రమేష్ యాదవ...

December 27th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని!

Image
  పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని! హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ‘పుస్తక స్ఫూర్తి’ చర్చాగోష్ఠి క్యాన్సర్‌ను జయించేలా చేసింది అంబేద్కర్ పుస్తకమే: ప్రజాకవి జయరాజు కన్ను మూసేదాకా పెన్ను మూసేది లేదు: సుద్దాల అశోక్ తేజ అక్షరం మనిషిని అద్భుత కళాకారుడిగా తీర్చిదిద్దుతుంది: కవి యాకూబ్ హైదరాబాద్, తూఫాన్ బ్యూరో: మనిషి శరీరానికి భోజనం ఎంత అవసరమో.. మెదడుకు పుస్తకం అంతకంటే ముఖ్యమని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అన్నారు. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం సాయంత్రం అనిశెట్టి రజిత వేదికపై ‘పుస్తక స్ఫూర్తి/పుస్తకం ఒక దారిదీపం’ చర్చా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్ సభను ప్రారంభించగా, సుద్దాల అశోక్ తేజ, ప్రజాకవి జయరాజు ముఖ్య వక్తలగా పాల్గొన్నారు.  పుస్తకమే నా ఊపిరి: సుద్దాల "కన్ను మూసేదాకా పెన్ను మూసేదే లేదు.. పెన్ను మూసేదాకా కన్ను మూసేదే లేదు" అంటూ సుద్దాల తన అక్షర నిబద్ధతను చాటుకున్నారు. ఆరో తరగతిలోనే మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ పుస్తకం తనను ప్రభావితం చేసిందని, ప్రేమ్ చంద్ రచనలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని గుర...

24 ఏళ్ల వయసులోనే డివిజన్ సాధించిన విద్యార్థి నేత – అదే డివిజన్ నుంచి విజయం సాధిస్తానన్న వినయ్ కుమార్

Image
 తూఫాన్(హైదరాబాద్):- ప్రజాస్వామ్య మార్గంలో పోరాడితే ఏదైనా సాధ్యమని నిరూపించారు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకుడు వినయ్ కుమార్ (24). బాగ్‌లింగంపల్లి డివిజన్ సరిహద్దులు, పేరు మార్పు, మరియు పరిపాలనాపరమైన అవకతవకలపై ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం చివరకు ఫలించింది. కేవలం 24 ఏళ్ల ప్రాయంలోనే రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో హైకోర్టు ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారుల మెడలు వంచి, తన డివిజన్ సమస్యకు పరిష్కారం సాధించడం ఇప్పుడు నగర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల మొండివైఖరి.. హైకోర్టు జోక్యం డివిజన్ సమస్యలపై తొలుత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినయ్ కుమార్ విన్నవించినా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వెనక్కి తగ్గకుండా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వినయ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. తక్షణమే విచారణ జరపాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో దిగివచ్చిన అధికారులు విచారణ చేపట్టి, వినయ్ కుమార్ సూచించిన మార్పులను అమలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ సిద్ధాంతమే ప్రేరణ ఈ విజయంపై వినయ్ కుమార్ స్పందిస్తూ.. "రాజ్యాంగమే మన బలం" అని రాహుల్ గాంధీ చెప్పే మా...

కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు - తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

Image
తూఫాన్(హైదరాబాద్):- రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీఓలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తూ, వక్రీకరిస్తూ సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేసారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని ఆయన స్పష్టం చేసారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కొరవచ్చని ఆయన ...

December 26th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షరసేద్యం.. కవితా గానం

Image
బుక్ ఫెయిర్‌లో ఉర్రూతలూగించిన కవి సమ్మేళనం ఆలోచింపజేసిన 'దుఃఖ నది'.. అలరించిన 'బలిపీఠం' రెండు సెషన్లలో 30 మంది కవుల కవితా గానం కవులకు సాహిత్య అకాడమీ నూతన సంవత్సర క్యాలెండర్ల పంపిణీ  హైదరాబాద్:-  అక్షరాల నిధి.. పుస్తకాల కాణాచి అయిన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం సాయంత్రం కవితా గానంతో ఉర్రూతలూగింది. ఎన్టీఆర్ స్టేడియంలోని అనిశెట్టి రజిత వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, ప్రముఖ కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాములు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. రెండు సెషన్లుగా సాగిన ఈ సమ్మేళనంలో సుమారు 30 మంది కవులు పాల్గొని సమకాలీన అంశాలపై తమ కలాన్ని వినిపించారు. హృదయాలను తాకిన కవితలు  సమ్మేళనంలో ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని పంచింది. 'మా నాన్న ప్రవహించే.. దుఃఖ నది' శీర్షికతో సాగిన కవిత అందరినీ ఆలోచింపజేయగా.. 'దక్షిణ భారతదేశానికి బర్రె ఆవుతో సమానం' అంటూ ద్రవిడ దేశంలో బర్రె ప్రాముఖ్యతను చాటిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేబుల్ టీవీ స...

December 25th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షర సేద్యం.. పఠనమే భాగ్యం

Image
  ఉత్తేజంగా ‘బుక్ వాక్’.. ప్రారంభించిన సి.ఎస్. రామకృష్ణారావు ఎన్.టి.ఆర్ స్టేడియంలో సందడిగా 38వ పుస్తక ప్రదర్శన సాంకేతికత పెరిగినా తగ్గని పుస్తక ప్రాధాన్యత తరలివచ్చిన రచయితలు, సాహితీవేత్తలు, విద్యార్థులు హైదరాబాద్:-మారుతున్న ప్రపంచంలో సాంకేతికత ఎన్ని మార్పులు తీసుకొచ్చినప్పటికీ, పుస్తకానికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేర్కొన్నారు. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన *‘బుక్ వాక్’*ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బుధ‌వారం లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం నుండి ఎన్.టి.ఆర్ స్టేడియంలోని అందే శ్రీ ప్రాంగణం (బుక్ ఫెయిర్) వరకు ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది.   జ్ఞానానికి వారధి.. పుస్తకం ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ.. పుస్తకాలు అనేవి మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే అద్భుతమైన కిటికీల వంటివని అభివర్ణించారు. వ్యక్తిగత వికాసం: ఇతరుల జీవిత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి పఠనం ఒక వారధిలా ఉపయోగపడుతుంద‌న్నారు.   బాహ్య ప్రపంచం వేగంగా మారినా, పుస్తకాల ద్వారా పొందే జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్...

December 24th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 23rd, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షరాల్లో ‘క్వియర్‌’ అనుభవాల ఆవిష్కరణ

Image
అక్షరాల్లో ‘క్వియర్‌’ అనుభవాల ఆవిష్కరణ - హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో ఆసక్తికరంగా సాగిన చర్చాగోష్టి - సమాజపు ముద్రలను చెరిపివేసి.. మనిషిగా చూడాలి: రచయితల ఆకాంక్ష హైదరాబాద్‌ : ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో భాగంగా ఆదివారం 'క్వియర్‌ అనుభవాలు - సాహిత్య సృజన' అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టి ఆలోచింపజేసింది. దీప్తి సిర్ల మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రచయితలు అవిజిత్‌ కుందు, పారస్‌ వత్స్‌, రచన ముద్రబోయిన, అపర్ణ తోటలు పాల్గొని తమ జీవిత ప్రయాణంలోని ఒడిదుడుకులను, సాహిత్య అనుభవాలను పంచుకున్నారు.  ముద్రలు వద్దు.. మనుషులుగా చూడండి  రచయిత అవిజిత్‌ కుందు మాట్లాడుతూ.. క్వీర్‌ సాహిత్యాన్ని కేవలం ఒక ప్రత్యేక ముద్రతో చూడకుండా, అది సమాజంలోని ఒక వర్గం నుంచి వస్తున్న సాధారణ సాహిత్యంగానే గుర్తించాలని కోరారు. తన 'మెన్ డోంట్ డ్యాన్స్' పుస్తకానికి మహిళల నుంచి కూడా విశేష స్పందన వచ్చిందని, భావోద్వేగాల పరంగా మనందరం ఒకటేనని పేర్కొన్నారు. మరో రచయిత పారస్‌ వత్స్‌ తన ఆత్మకథ 'నజీత్‌' ప్రచురణ తర్వాత ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తన అస్తిత్వాన్ని ...

December 21st, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 20th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయం కావాలి .... పుస్తక ప్రదర్శనలను జిల్లాలకు విస్తరిస్తాం: మంత్రి జూపల్లి

Image
 హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌ ప్రారంభం హైదరాబాద్‌ సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తివంతమైన ఆయుధమని, ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయంగా మారాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన 38వ హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన అనంత‌రం... పునాస మ్యాగ‌జైన్‌ ఆవిష్కరించారు.  ప్రభాత భేరి కరపత్రం...మరియు కాలెండర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేటి కాలంలోనూ ఏటా 15 లక్షల మంది పుస్తక ప్రదర్శనకు రావడం శుభపరిణామన్నారు. విలువలతో కూడిన విద్యే ముఖ్యం ప్రస్తుత విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని, ఇది మనిషిని సంస్కరించలేకపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "నాటి తరం ఆలోచనా విధానం, విలువలు నేడు కల్తీ అయిపోయాయి. కేవలం ఉద్యోగం, సంపాదన ధోరణిలో పడి మానవ జన్మ సార్థకతను మర్చిపోతున్నాం. పాత కాలపు సంస్కారం మళ్లీ రావాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాల...