దివ్యాంగుల సేవలో తరిద్దాం.. గాంధీనగర్‌లో వీల్‌చైర్ల పంపిణీ
- అంతర్జాతీయ వీల్‌చైర్ దినోత్సవం వేళ మానవీయత చాటుకున్న మాజీ కార్పొరేటర్ - ఆపన్నులకు అండగా నిలవడమే అసలైన పండుగ: శైలజ గోపాల్ తూఫాన్,హైదరాబాద్ :- ఆదివారం అంతర్జాతీయ వీల్‌చైర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ పరిధిలో డివిజన్ మాజీ కార్పొరేటర్ టి. శైలజ గోపాల్ ఆధ్వర్యంలో వి.వి. గిరి నగర్‌లో వీల్‌చైర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర దివ్యాంగుల సెల్ కన్వీనర్ నాగేశ్వర్ రావుతో కలిసి మాజీ కార్పొరేటర్ టి. సైలజా గోపాల్ గాంధీనగర్ డివిజన్ సీనియర్ మహిళా నాయకురాలు సువర్ణ భర్త రమేష్‌కు వీల్‌చైర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల పట్ల వివక్ష చూపకుండా, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.గోపాల్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు నవీన్ నాయకులూ సాయి చంద్, శ్రీకాంత్, వి.ఎస్.టి రాజు, దామోదర్, వాణి శాస్త్రి, సురేష్, నవీన్, నర్సింగ్, లక్ష్మీనారాయణ, ప...