Posts

Showing posts with the label #bjp #ckrishnayadav #exminister #traningclasses

బూత్ స్థాయి నుంచే పార్టీ పటిష్టం.. అంబర్‌పేటలో బీజేపీ శిక్షణ తరగతులు

Image
- పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ప్రారంభం - పాల్గొన్న మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, పార్టీ ముఖ్య నేతలు  తూఫాన్,హైదరాబాద్ :- అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని బర్కత్‌పురాలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం 'పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ - 2026' కార్యక్రమం ఘనంగా జరిగింది. నల్లకుంట డివిజన్ పరిధిలోని కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంగా నిర్వహించిన ఈ శిక్షణ తరగతులకు మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రజా పోరాటాలపై ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని నాయకులకు సూచించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో శక్తి కేంద్రాల ఇన్చార్జీలు, బూత్ కోఆర్డినేటర్లు, పన్నా ప్...