Posts

Showing posts with the label acb telangana

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి

Image
  లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి హైదరాబాద్‌, మాధాపూర్‌: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిర్యాదుదారుడిని నుంచి లంచం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అనిశా (ACB) అధికారులకు ఓ ప్రభుత్వ అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  మాధాపూర్‌ ప్రాంతానికి చెందిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి ఎం. సుధ ఓ కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసి, నంబర్‌ జారీ చేయడానికి సంబంధించి ఫిర్యాదుదారుడిని నుంచి రూ.8,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ మంగళవారం సాయంత్రం అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే, లంచం ఇవ్వడం తల్లడిల్లిన బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. వారి పర్యవేక్షణలో నిర్వహించిన వలలో ఎం. సుధ లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిశా అధికారులు వెల్లడించారు.