ఘనంగా మర్రి చెన్నారెడ్డి 107వ జయంతి వేడుకలు
- చెన్నారెడ్డి స్మారక వనంలో నివాళులర్పించిన ప్రముఖులు.. తూఫాన్,హైదరాబాద్:- మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 107వ జయంతి వేడుకలు మంగళవారం ఇందిరా పార్క్ సమీపంలోని ఆయన స్మారక వనంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. డాక్టర్ ఎం. చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ మరియు జీహెచ్‌ఎంసీ సంయుక్తాధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించిన నేతలు ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి తదితరులు చెన్నారెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనొక ధీశాలి.. రాజకీయ దిక్సూచి ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మర్రి చెన్నారెడ్డి గారు పరిపాలనా దక్షుడని, సమైక్య రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణ ఉద...