*జీహెచ్ఎంసీలో ఎస్.ఎఫ్.ఏలకు రూ. 500 అలవెన్స్ పెంపు* *పారదర్శకంగా ఎస్.ఎఫ్.ఏల అంతర్గత బదిలీలు* జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య క్షేత్ర సహాయకుల(ఎస్.ఎఫ్.ఏ) అలవెన్స్‌ను రూ. 1000 నుండి రూ. 1,500లకు పెచండంతో పాటు వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి నేడు ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర వహించే ఎస్.ఎఫ్.ఏలు తమ అలవెన్స్‌ను పెంచాలనే సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని మరో రూ. 500లను పెంచుతున్నట్టు కమిషనర్ ప్రకటించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 948 మంది ఎస్.ఎఫ్.ఏలు ఉండగా వీరిలో 936మంది ఔట్‌సోర్సింగ్ పద్దతిన విధులు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వీరిని బదిలీచేయాలని కార్పొరేటర్లు, శాసన సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అనేకమార్లు కోరడం జరిగింది. వీరి బదిలీపై జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో కూడా పలుమార్లు ప్రస్థావన వచ్చింది. గతంలో ఎస్.ఎఫ్.ఏల బదిలీలను చేప...