Posts

Showing posts with the label #hyderabadpolicenews #crimenewstelanagna #telanganapolice

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

Image
● నేరస్తులకు శిక్ష పడేలా పక్కా ప్రణాళిక ● హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనర్  ● నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు. నేరస్తులను కేవలం అరెస్టు చేయడమే కాకుండా.. వారికి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చూడటమే పోలీసుల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.  బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో  అక్టోబరు నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న  కేసులు, అక్విటల్ అయిన పాత కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి.. ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్‌ వేటు తప్పదని ...