డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మన తారక మంత్రం కావాలి
డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మన తారక మంత్రం కావాలి అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి Toofan E Paper 15th Nov 2025 హైదరాబాద్: నవంబర్ 14(TOOFAN): రోడ్డు ప్రమాదల కారణంగా మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో డిఫెన్సివ్ డ్రైవింగ్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి. సి. సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తదితర పోలీసు అధికారుల సమక్షంలో డిజిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రారంభిస్తున్న కార్యక్రమం అతి ముఖ్యమైనదని నాలుగు మాటలతో, పాటలతో ముగిసిపోయే విషయం కాదని స్పష్టం చేశారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ వాహనదారుల తారకమంత్రం కావాలని, దాదాపు ప్రతి కుటుంబం రోడ్డు ప్రమాదాల సంఘటనలు ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. Toofan E Paper 15th Nov 2025 రాష్ట్...