ఉత్తమ కాలనీలకు ప్రత్యేక అవార్డులు...ప్రతి నెల 30వ తేదీలోగా దరఖాస్తులకు ఆహ్వానం
*ఉత్తమ కాలనీలకు ప్రత్యేక అవార్డులు...ప్రతి నెల 30వ తేదీలోగా దరఖాస్తులకు ఆహ్వానం* *ప్రతి సర్కిల్‌కు ఐదు అవార్డులు* హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘాలను మరింత చురుకుగా భాగస్వామ్యం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకుగాను స్వచ్ఛ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచిన కాలనీ సంక్షేమ సంఘాలకు ప్రతినెల ప్రత్యేక పురస్కారాలు అందజేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కాలనీ సంక్షేమ సంఘాలకు అవార్డులు అందజేసే ప్రక్రియ ఇటీవల నిలిచింది. కాలనీ సంక్షేమ సంఘాలకు తిరిగి అవార్డులు అందజేయాలని, ఇందుకుగాను 11విభాగాలను నిర్థారించి వాటిలో ఆయా కాలనీలు చేపట్టిన చర్యలను తెలుపుతూ ప్రతినెల 30వ తేదీలోగా సంబంధిత డిప్యూటి కమిషనర్లకు అందజేయాలని, ఆర్‌డబ్ల్యూఏలకు కమిషనర్ సూచించారు. ఈ అవార్డుల వివరాలన్నీ జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగిందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతినెల 5వ తేదీన ఈ అవార్డులను సంబంధిత డిప్యూటి కమిషనర్లు అందజేస్తారని కమిషనర్ ప్రకటించారు. ఒక్కో సర్కిల...