Posts

Showing posts from January, 2026

January 31st, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి: కృష్ణ యాదవ్ పిలుపు

Image
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు.. అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో సందడి  తూఫాన్,హైదరాబాద్ :- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తన జోరును పెంచింది. గురువారం ముడుచింతలపల్లి, ఎల్లంపల్లి, మరియు అలీయాబాద్ మున్సిపాలిటీల్లో నిర్వహించిన అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ముడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మద్దతుగా భారీ జనసందోహంతో తరలివచ్చిన శ్రేణుల నినాదాలతో పరిసరాలను హోరెత్తించాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా కృష్ణ యాదవ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా వ్యతిరేక పాలనపై గళమెత్తాలి ఈ సందర్భంగా జరిగిన నాయకుల సమావేశంలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకత్వంలోని వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఓటర్లకు వివరించాలని పార్టీ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులక...

January 30th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

January 29th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

January 28th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

సంగీత విద్వాంసుడు ఓరుగంటి ఆనంద్ మోహన్ కన్నుమూత

Image
 సంగీత విద్వాంసుడు ఓరుగంటి ఆనంద్ మోహన్  కన్నుమూత తూఫాన్ -   హైదరాబాద్ (సాంస్కృతిక విభాగం): ప్రముఖ సంగీతజ్ఞులు, 'సంగీత క్షీరసాగరం' వ్యవస్థాపకులు విద్వాన్  ఓరుగంటి ఆనంద్ మోహన్  (90) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని జవహర్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు సంతానం.  సంగీతమే శ్వాసగా.. 1956 నుంచి 1977 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత కళాకారుడిగా సేవలందించిన ఆనంద్ మోహన్, వృత్తిరీత్యా ఢిల్లీలోని కాగ్ (CAG) కార్యాలయంలో పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని సంగీతానికే అంకితం చేశారు. తన గురువు ఉప్పలపాటి అయ్యగారి స్మరణార్థం 2002లో 'సంగీత క్షీరసాగరం' సభను స్థాపించి, సప్తపర్ణి సహకారంతో ఇప్పటివరకు 699 కచేరీలను నిర్వహించారు. ఎవరి వద్ద ధనసహాయం పొందకుండా నిస్వార్థంగా ఈ కచేరీలు నిర్వహించడం విశేషం. అందుకున్న పురస్కారాలు శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన కృషికి గాను 2012లో కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా గౌరవం పొందారు. 2013లో చెన్నైలో జ్ఞాన సరస్వతీ పీఠ పురస్కారాన్ని అందుకున్న...

వివేకానగర్‌లో గణతంత్ర సంబరాలు

Image
తూఫాన్,హైదరాబాద్ :- చిక్కడపల్లి వివేకానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం జనతా పార్క్ సమీపంలో ఘనంగా జరిగాయి. నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. అసోసియేషన్ అధ్యక్షుడు వాణీశ్వర శాస్త్రి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూనే, పౌరులుగా మన బాధ్యతలను విస్మరించకూడదని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో సహకరించాలని ఆయన కోరారు. వేడుకల్లో భాగంగా చిన్నారులకు, స్థానిక కాలనీవాసులకు మిఠాయిలు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి. గోపాల్, నర్సింగ్ రావు, జాయింట్ సెక్రటరీ దోనేటి సత్యం పాల్గొన్నారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. శ్రీనివాస్, చిలుకూరి అఖిలేష్, ఈశ్వర్‌తో పాటు భారీ సంఖ్యలో కాలనీవాసులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.  

లలిత కళా తోరణంలో 'గుడ్‌విల్@40' వేడుకలు

Image
ఘనంగా రిపబ్లిక్ డే సంబరాలు.. హాజరైన బండారు దత్తాత్రేయ తూఫాన్,హైదరాబాద్ :- హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళా తోరణం వేదికగా గుడ్‌విల్ స్కూల్స్ 40 ఏళ్ల విద్యా ప్రయాణాన్ని పురస్కరించుకుని 'Goodwill@40' పేరుతో రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గత నాలుగు దశాబ్దాల్లో భారతదేశం సాధించిన ప్రగతితో పాటు గుడ్‌విల్ స్కూల్స్ ఎదుగుదలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంప్రదాయాలు, కళలను ప్రదర్శించడమే కాకుండా.. 'న్యూ ఇండియా' స్ఫూర్తిని చాటుతూ డ్రోన్ టెక్నాలజీ, సౌర శక్తి నైపుణ్యాలు, ఇస్రో శాస్త్రవేత్తల కృషిని విద్యార్థులు సృజనాత్మకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో విలువలతో కూడిన విద్యా సంస్థల పాత్ర కీలకమని, గుడ్‌విల్ స్కూల్స్ నలభై ఏళ్లుగా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధితో పాటు గు...

సైదాబాద్‌లో వైభవంగా శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు

Image
 ఎనిమిదో రోజుకు చేరిన మహోత్సవాలు.. భక్తిపారవశ్యంలో టీన్ మంజిల్ కాలనీ తూఫాన్,హైదరాబాద్ :-   టీన్ మంజిల్ కాలనీలోని దుర్గామాతా మందిరం వేదికగా జరుగుతున్న శ్రీ రాజశ్యామల అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఈ మహా యాగంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున గోపూజ, ప్రాతఃకాల అర్చనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం గణపతి, లక్ష్మీ గణపతి హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం భవానీశంకర స్వామికి, అమ్మవారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. సాయంత్రం రాజశ్యామల అమ్మవారి మూల మంత్ర జపం, హోమం, రుద్రా సహిత మండప దేవత హోమాలు నిర్వహించనున్నారు. ప్రదోషకాల అర్చన, లలితా సహస్రనామ కుంకుమార్చనలతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. అనురాగ్ శర్మ, సాయిరాం శర్మ, పవన్ శర్మ, సాయి ప్రణవ్ శర్మ, దివాకర్ శర్మల మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత క్రమశిక్ష...

పద్మశాలి సంఘం రాజకీయ చైతన్య వేదిక.. ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ

Image
తూఫాన్,హైదరాబాద్ :- హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా ముషీరాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 'రాజకీయ చైతన్య వేదిక' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయంగా పద్మశాలీలు సంఘటితమై తమ హక్కుల సాధనకై పోరాడాలని, చట్టసభల్లో సముచిత స్థానం పొందేలా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సామాజిక అభివృద్ధిలో పద్మశాలీల పాత్రను కొనియాడారు. సంఘం అధ్యక్షుడు అతినగరం సుధేష్ నేత అధ్యక్షతన జరిగిన ఈ సభలో బొమ్మెర్ల సతీష్ కుమార్, ఏ. వినయ్ కుమార్, బొట్టు శ్రీనివాస్ నేత తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పద్మశాలీల రాజకీయ భవిష్యత్తు మరియు సంఘం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.  

రాంనగర్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

Image
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తూఫాన్,హైదరాబాద్ :- హైదరాబాద్‌లోని రాంనగర్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని దత్తాత్రేయ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. దేశాభివృద్ధిలో యువత చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి, నేతలు నేతి రాజేశ్వర రావు, సాయి కృష్ణ యాదవ్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. పరిసర ప్రాంతమంతా "భారత్ మాతా కీ జై" నినాదాలతో మారుమోగింది.  

వివేక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Image
తూఫాన్,హైదరాబాద్ :-   వివేక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం చిక్కడపల్లిలోని జనతా పార్కులో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సి.హెచ్. వానీశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.సంఘం ఉపాధ్యక్షులుగా టి. గోపాల్, నర్సింగ్ రావు, కోశాధికారిగా సురేష్ రాజు బాధ్యతలు స్వీకరించారు. అలాగే సంయుక్త కార్యదర్శిగా దోనేటి సత్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిలుకూరి అఖిలేష్, ఈశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్, బి.వి. సాయినాథ్, లక్ష్మీ నారాయణలు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన డాక్టర్ నరేష్ గౌడ్, రాజమోహన్, శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కొత్త కార్యవర్గం కాలనీ సమస్యల పరిష్కారానికి, ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన బాధ్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  

January 27th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

అంబర్‌పేటలో ఉచిత మెగా వైద్య శిబిరం

Image
రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో వందలాది మందికి ఆరోగ్య పరీక్షలు తూఫాన్,హైదరాబాద్ :-   స్థానిక చే నంబర్ చౌరస్తాలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్షత్రియ రాజ్‌పుత్ ట్రస్ట్ బోర్డ్, బద్రీవిశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవా దళ్ సంయుక్త ఆధ్వర్యంలో సాధురామ్ ఐ హాస్పిటల్, కిమ్స్ (KIMS), సన్‌షైన్ హాస్పిటల్స్ మరియు భగవాన్ మహావీర్ వికలాంగ్ సమితి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు వందలాది మంది రోగులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా కంటి పరీక్షలతో పాటు ఎముకలు, గుండె మరియు జనరల్ చెకప్‌లు నిర్వహించి రోగులకు తగిన సలహాలు సూచనలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని సందర్శించిన ఆయన, నిర్వాహకులు మరియు వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులతో మాట్లాడి, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమ...

పద్మ పురస్కారాల్లో తెలుగు వెలుగులు.. విజేతలకు రేవంత్ రెడ్డి అభినందనలు

Image
అమెరికా పర్యటన ముగిశాక ప్రభుత్వం తరపున గౌరవ సత్కారం తూఫాన్,హైదరాబాద్ :- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తమ ముద్ర వేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. పద్మశ్రీ విభాగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్ర మౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ ఎంపిక కాగా, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డిలకు ఈ గౌరవం దక్కింది. పశుసంవర్ధక రంగం నుంచి మామిడి రామా రెడ్డి, విద్యా–సాహిత్య రంగాల నుంచి మామిడాల జగదీశ్ కుమార్, వెంపటి శశిశేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రిలు పురస్కార గ్రహీతల జాబితాలో నిలిచారు. కళా రంగం నుంచి దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తమ సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాలను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పురస్కార గ్రహీతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విజేతలు తమ రంగాల్లో అందించిన విశిష్ట సేవలు, అంకితభావమే ఈ ప్రత...

బాధ్యతాయుత ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Image
 బాధ్యతాయుత ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణలో ఓటర్లు 3.39 కోట్లకు చేరారు: సీఈవో సి. సుధర్శన్ రెడ్డి హైదరాబాద్, జనవరి 25, (Toofan): బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది థీమ్ “నా భారత్ – నా ఓటు” పౌరులే భారత ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువని స్పష్టంగా తెలియజేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం స్థాపనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘానికి కల్పించిన స్వతంత్రత, నిష్పక్షపాతత్వమే స్వేచ్ఛాయుత, న్యాయసమ్మత ఎన్నికలకు పునాది అని గవర్నర్ అన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదని చెప్పారు. తెలంగాణలో...

త్యాగరాజ కీర్తనామృతంతో పులకించిన భాగ్యనగరం: 1500 గళాల ‘పంచరత్న’ గానం!

Image
  మాదాపూర్, జనవరి 25 :-  భాగ్యనగరంలోని సాంస్కృతిక వేదిక శిల్పారామం ఆదివారం త్యాగరాజ కీర్తనామృతంతో పులకించిపోయింది. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 179వ ఆరాధన ఉత్సవాలను 'సంస్కృతి ఫౌండేషన్' ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గత 11 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ నాద యజ్ఞాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకులు, ఈ ఏడాది కూడా వేడుకలను కన్నుల పండువగా తీర్చిదిద్దారు. మార్మోగిన పంచరత్న కీర్తనలు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన 'పంచరత్న కీర్తనల గోష్ఠి గానం' భక్తులను, సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. సుమారు 600 మంది సంగీత విద్వాంసులు, 700 మందికి పైగా సంగీత ప్రేమికులు.. మొత్తం 1500 మంది ఏకకంఠంతో త్యాగయ్య కృతులను ఆలపించడంతో శిల్పారామం ప్రాంగణం ఒక ఆధ్యాత్మిక లోకాన్ని తలపించింది. గత ఏడు రోజులుగా సీసీఆర్‌టీ (CCRT) వేదికగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధ విద్వాంసులు, యువ కళాకారులు అందించిన వైవిధ్యభరిత ప్రదర్శనలు ఈ వేడుకలకు ముగింపుగా నిలిచాయి. సంగీత దిగ్గజాలకు 'గురు సన్మానం' సంగీత రంగంలో విశేష సేవలందించిన పలువురు దిగ్గజాలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రముఖ వాయులీన విద్వాంస...

రోహింగ్యాలను వెనక్కి పంపాల్సిందే..

Image
బాలాపూర్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 'ధర్మ రక్షణ సభ' తూఫాన్,హైదరాబాద్ :- హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు గణేష్ సేన సంయుక్తాధ్వర్యంలో 'జాగో భాగ్యనగర్ - చలో బాలాపూర్' పేరుతో భారీ ధర్మ రక్షణ సభ నిర్వహించబడింది. అక్రమంగా చొరబడిన బాంగ్లాదేశీయులను మరియు రోహింగ్యాలను తక్షణమే వెనక్కి పంపాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సభ జరిగింది. దేశ భద్రతే ముఖ్యం ఈ సభకు రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆచార్య గిరిధర్ స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దేశ భద్రత దృష్ట్యా అక్రమ వలసదారులను ఏమాత్రం ఉపేక్షించకూడదని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఈ సభకు భక్తులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పాల్గొన్న ప్రముఖులు అలె భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, బండారు విజయలక్ష్మి, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య వంటి ప్రముఖ నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రోహింగ్యాల వెలివేతపై నేతలు చేసిన ప్రసంగాలు సభికులను ఆలోచింపజేశాయి.  

హైదరాబాద్‌లో బీసీ కవులు, రచయితల మహాసమ్మేళనం

Image
 హైదరాబాద్‌లో బీసీ కవులు, రచయితల మహాసమ్మేళనం బీసీల హక్కుల సాధనకై కలాలను పదునుపెట్టాలి ‘జననాయక’, ‘కర్పూరీ ఠాకూర’ పుస్తకాల ఆవిష్కరణ సభలో బీసీ సాహితీవేత్తల ప్రతిజ్ఞ ఎన్నెన్నో మహోద్యమాలకు పాదువేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ జలదృశ్యం ప్రదేశం నుంచి బీసీల ఉద్యమకొండ లక్ష్మణ్‌బాపూజీ విగ్రహం సాక్షిగా బీసీ కవులు, రచయితలు, విద్యావేత్తలు బీసీల హక్కుల సాధన ఉద్యమానికి తమ కలాలను పదునెక్కిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హైదరాబాద్‌లో త్వరలో బీసీ కవులు, రచయితల మహాసమ్మేళనాన్ని నిర్వహించి బీసీ సాహిత్య, సాంస్క్రుతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని బీసీ సాహితీవేత్తలు నిర్ణయించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు సాహిత్య, సాంస్క్రుతికక రంగం క్రియాశీలక పాత్ర పోషించాలని తీర్మానించారు. కర్పూరీ ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై గల కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహంవద్ద శనివారం నాడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన “జననాయక” కర్పూరీ ఠాకూర్‌పై కవితా సంకలనం, “జన నాయక్ కర్పూరీ ఠాకూర”పై వ్యాససంకలనం రెండు పుస్తకాలను రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, లాల్‌నీల్ రూపకర్త, సామాజిక ఉద్యమకారుడు జి.రాములు ఆవిష్కరించారు....

కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

Image
 కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు  కేటీఆర్ లీగల్ నోటీసులు నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో, సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక భారత్ రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు తనపై మరియు తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గానూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్ మరియు ధర్మపురి అరవింద్‌లకు విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఇలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశం పూర్వకంగా, నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ…చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్ లకు ...

January 25th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

హెచ్‌ఎండీఏ జోనింగ్‌తో రైతులకు శాపం

Image
గ్రామాల విలీనం అశాస్త్రీయం.. ప్రభుత్వంపై వత్తిడి తెద్దాం బౌరంపేట్‌లో రైతులతో సమావేశమైన బండారు దత్తాత్రేయ తూఫాన్,హైదరాబాద్ :- ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం అశాస్త్రీయమని, దీనివల్ల గ్రామాల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడ్చల్ జిల్లా బౌరంపేట్ గ్రామంలో శుక్రవారం పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. సామాన్య రైతులకు తీరని నష్టం అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ పరిధిలోని కన్జర్వేషన్, రిక్రియేషన్ జోన్ల వల్ల సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. "70 ఏళ్లుగా పేద రైతుల స్వాధీనంలో ఉన్న లావాణి పట్టా భూములను ప్రభుత్వం లాక్కోవడం సరైన పద్ధతి కాదు. ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు నుంచి రైతులు తమ సొంత పొలాల్లోకి వెళ్లే దారిని కూడా అధికారులు అడ్డుకోవడం దారుణం" అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ.. లేదంటే...

నేతాజీ త్యాగం వెలకట్టలేనిది

Image
  సుల్తాన్ షాహీలో ఘనంగా బోస్ జయంతి వేడుకలు నివాళులర్పించిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తూఫాన్,హైదరాబాద్ :- భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 'ఆజాద్ హింద్ ఫౌజ్' స్థాపించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన ధీశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ కొనియాడారు. శుక్రవారం సుల్తాన్ షాహీ చౌరస్తాలో నేతాజీ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ చిత్రపటానికి కృష్ణ యాదవ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. "చలో ఢిల్లీ" అంటూ దేశం కోసం నేతాజీ చేసిన త్యాగం, ఆయన పరాక్రమం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని నేతాజీ సేవలను గుర్తుచేసుకున్నారు. నాయకులు కన్వీనర్ ప్రవీణ్ కుమార్, పాశం సురేందర్ మరియు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. నేతాజీ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

January 24th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

January 23rd, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

స్థానిక నిధుల ఆడిట్ (ఎల్ఎఫ్ఏ) డైరెక్టరేట్లు, రాష్ట్ర ఆడిట్ విభాగాల కోసం మూడు రోజుల జాతీయ వర్క్‌షాప్

Image
 స్థానిక నిధుల ఆడిట్ (ఎల్ఎఫ్ఏ) డైరెక్టరేట్లు, రాష్ట్ర ఆడిట్ విభాగాల కోసం మూడు రోజుల జాతీయ వర్క్‌షాప్ హైదరాబాద్, 2026 జనవరి 21(TOOFAN):  సంస్థాగత యంత్రాంగాన్నీ, వృత్తిపరమైన సమర్థతనూ, స్థానిక ప్రభుత్వాలకు బాధ్యత వహించే ప్రాథమిక ఆడిటింగ్ సంస్థల (పీఏఐ) ఆడిట్ పద్ధతులనూ బలోపేతం చేయడం లక్ష్యంగా - స్థానిక నిధుల ఆడిట్ డైరెక్టరేట్లు (డీఎల్ఎఫ్ఏ), రాష్ట్ర ఆడిట్ విభాగాల కోసం.. గ్రామీణాభివృద్ధి అంతర్గత ఆడిట్ కేంద్రం (సీఐఏఆర్డీ), జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించాయి. అంతర్జాతీయ స్థానిక సంస్థల ఆడిట్ కేంద్రం (ఐసీఏఎల్) సహకారంతో 2026 జనవరి 19 నుంచి 21 వరకు ఈ సంస్థలు వర్క్‌షాప్ ను నిర్వహించాయి. ముగింపు సమావేశానికి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ సంజయ మూర్తి, ఎన్ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి. నరేంద్ర కుమార్, డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ మనీశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహానీ హాజరయ్యారు. ఐసీఏఎల్ డైరెక్టర్ జనరల్ శ్రీ హెచ్.కె. ధర్మదర్శి కూడా ఈ కార్యక్రమంలో పాల...

మేడారం మహా జాతర ప్రారంభానికి మరో ఏడు రోజులు

Image
 మేడారం మహా జాతర ప్రారంభానికి మరో ఏడు రోజులు జాతర నిర్వహణలో 50 వేల మంది అధికారులు, సిబ్బంది     ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో వారంరోజులు మాత్రమే ఉండడంతో ఈ జాతర ఏవిధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 28 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు కోటిన్నర కు పైగా మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం చరిత్రలో గతంలో మరెన్నడూ లేని విధంగా 2026 జాతరకు రూ. 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కేటాయించారు. మరో వందేళ్ల వరకు నిలిచిపోయేలా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధికే రూ. 100 కోట్లను కేటాయించి రికార్డు సమయంలో పనులను పూర్తి చేశారు. ఈనెల 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఈ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు.        *జాతర నిర్వహణకు 50,000 మంది అధికారులు, సిబ్బంది *        ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు హాజరవుతా...

January 22nd, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

ఫోన్ ట్యాపింగ్ విచారణ ఓ డ్రామా.. ఢిల్లీకి, ఫాంహౌస్‌కు డీల్ కుదిరిందా?: బండి సంజయ్

Image
  ఫోన్ ట్యాపింగ్ విచారణ ఓ డ్రామా.. ఢిల్లీకి, ఫాంహౌస్‌కు డీల్ కుదిరిందా?: బండి సంజయ్ రెండేళ్లుగా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు.. అసలు సూత్రధారులను ఎందుకు వదలడటం లేదు? హైదరాబాద్ (రాజకీయ విభాగం): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగుతున్న తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించే డ్రామా అని ఆయన విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.  డీల్ కుదిరిందా? "ఢిల్లీకి, ఫాంహౌస్‌కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా? అందుకే విచారణ ఇలా నత్తనడకన సాగుతోందా?" అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారులైన తండ్రీకొడుకులను (కేసీఆర్, కేటీఆర్) ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. రెండేళ్లుగా విచారణ చేస్తున్న సిట్.. కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. సాగదీత విచారణపై ఆగ్రహం: కర్ర విరగదు.. పాము చావదు: ఈ కేసు విచారణ తీరు చూస్తుంటే 'కర్ర విరగదు.. పాము చావదు...

January 21st, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image