కావూరి సేవలు అమోఘం.. సాంబశివరావు కుటుంబానికి చంద్రబాబు, దత్తాత్రేయ పరామర్శ
- రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడిన నేత - హైదరాబాద్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన ప్రముఖులు తూఫాన్,హైదరాబాద్ (సిటీ బ్యూరో) :- మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని కావూరి నివాసానికి వెళ్లిన వారు.. సాంబశివరావు భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కావూరి సాంబశివరావు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. వివాదరహితుడిగా, హుందాతనం గల నాయకుడిగా ఆయన అందరి గౌరవాన్ని పొందారని గుర్తుచేశారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కావూరితో తనకు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధం ఉందని స్మరించుకున్నారు. పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. కావూరి మరణం తెలుగు ప్రజలకు తీ...