Posts

Showing posts with the label #formergovernerbandarudattatreya #bandarudattatreya

హెచ్‌ఎండీఏ జోనింగ్‌తో రైతులకు శాపం

Image
గ్రామాల విలీనం అశాస్త్రీయం.. ప్రభుత్వంపై వత్తిడి తెద్దాం బౌరంపేట్‌లో రైతులతో సమావేశమైన బండారు దత్తాత్రేయ తూఫాన్,హైదరాబాద్ :- ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం అశాస్త్రీయమని, దీనివల్ల గ్రామాల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడ్చల్ జిల్లా బౌరంపేట్ గ్రామంలో శుక్రవారం పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. సామాన్య రైతులకు తీరని నష్టం అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ పరిధిలోని కన్జర్వేషన్, రిక్రియేషన్ జోన్ల వల్ల సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. "70 ఏళ్లుగా పేద రైతుల స్వాధీనంలో ఉన్న లావాణి పట్టా భూములను ప్రభుత్వం లాక్కోవడం సరైన పద్ధతి కాదు. ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు నుంచి రైతులు తమ సొంత పొలాల్లోకి వెళ్లే దారిని కూడా అధికారులు అడ్డుకోవడం దారుణం" అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ.. లేదంటే...

మాస్టర్ ప్లాన్ జోన్లతో రైతులకు అన్యాయం: బండారు దత్తాత్రేయ

Image
 -  కోహెడలో బాధిత రైతులతో ముఖాముఖి  - ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ తూఫాన్(తుర్కయంజాల్) :- హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగ జోన్ల వర్గీకరణ కారణంగా సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బడా బాబులకే మేలు.. రైతులకు కీడు! అనంతరం జరిగిన సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా ఉందన్నారు. "పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములను రెసిడెన్షియల్ (నివాస) జోన్లుగా మారుస్తూ, పేద రైతుల భూములను మాత్రం కన్జర్వేషన్ (రక్షణ) జోన్లుగా ఉంచడం ఏ రకమైన న్యాయం?" అని ఆయన ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ (ORR) లోపల ఉన్న రైతుల భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా రెసిడెన్షియల్ జోన్ కిందకు మార్చాలని డిమాండ్ చేశారు. రైతులు తమ సొంత భూమిలో ఇల్లు కట్టుకోవాలన్నా నిబంధనలు అడ్డంకిగా మారడం శ...