అక్షర జాతరకు రికార్డు నీరాజనం!
ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్.. 16 లక్షల మందితో సరికొత్త చరిత్ర - సెల్ ఫోన్ల కంటే పుస్తకాలకే యువత మొగ్గు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి - రాజ్యాంగాన్ని ‘పాకెట్ సైజు’లో సామాన్యులకు అందించాలి తూఫాన్(హైదరాబాద్) :- హైదరాబాద్ నగరం నడిబొడ్డున 11 రోజుల పాటు సాగిన అక్షరాల పండుగ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ రికార్డు స్థాయి సందర్శకులతో ముగిసింది. ముగింపు సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భారత రాజ్యాంగాన్ని పాకెట్ సైజులో సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సెల్ ఫోన్లు, సినిమాలకు దూరంగా యువత ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం సమాజ మేధో అంతర్మథనానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి వాసు వార్షిక నివేదికను సమర్పిస్తూ.. గత ఏడాది 12 లక్షల మంది రాగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 16 లక్షలకు చేరుకుందని, అందులో 70 శాతం మంది యువతే ఉండటం విశేషమని వెల్లడించారు. 368 స్టాళ్లతో సాగిన ఈ మేళాను ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఒక 'మిలియన్ మార్చ్'గా అభివర్ణించగా, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె...