కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. - 4 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కొట్టేయాలని చేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ. 200ల కోట్లు వరకూ ధర పలుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు 700ల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొండాపూర్ విలేజ్‌లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీ వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. Toofan E Paper November 22nd 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు.. 1000 గజాల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పడివే ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బైనంబర్ల ద్వా...