డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మన తారక మంత్రం కావాలి

 డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మన తారక మంత్రం కావాలి


అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి

 Toofan E Paper 15th Nov 2025

హైదరాబాద్: నవంబర్ 14(TOOFAN): రోడ్డు ప్రమాదల కారణంగా మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో  డిఫెన్సివ్ డ్రైవింగ్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.  హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి. సి. సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తదితర పోలీసు అధికారుల సమక్షంలో డిజిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రారంభిస్తున్న  కార్యక్రమం  అతి ముఖ్యమైనదని నాలుగు మాటలతో, పాటలతో ముగిసిపోయే విషయం కాదని స్పష్టం చేశారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ వాహనదారుల తారకమంత్రం కావాలని, దాదాపు ప్రతి కుటుంబం రోడ్డు ప్రమాదాల సంఘటనలు ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.  Toofan E Paper 15th Nov 2025


రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 800 హత్యలు జరిగితే దానికన్నా 10 రెట్లు మించి మరణాలు రోడ్డు ప్రమాదంలో జరుగుతున్నాయని, ప్రజలకు వీటిపై అవగాహన కల్పించేందుకు మొట్టమొదట హైదరాబాద్ పోలీస్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం   ప్రశంసనీయమన్నారు.పాదచారులు, ద్విచక్ర వాహనదారులు అధికంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలన్నారు. ప్రమాదాలను నివారించేందుకు, తప్పించుకోవటానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులను తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు. డ్రైవింగ్ చేసేటప్పుడు  పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయటమే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అని తెలియజేశారు. రోడ్డు నిబంధనలను పాటించడమే కాకుండా కామన్ సెన్స్ తో కూడా డ్రైవింగ్ చేయటం వలన రోడ్ ప్రమాదాలను నివారించవచ్చని, ప్రాణాలను కూడ కాపాడుకోవచ్చు అని అన్నారు. కుటుంబ పెద్ద ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబ సభ్యులందరూ ఆధారాన్ని కోల్పోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదంలో పిల్లలు చనిపోతే వారి తల్లిదండ్రుల కడుపుకోత తీరనిదని, మనిషికి రెండో, మూడో ప్రాణాలు ఉండవని, ఉండే ఒక ప్రాణాన్ని అమూల్యమైనదిగా భావించి జాగ్రత్త వహించాలన్నారు. హెల్మెట్ మాత్రమే కాకుండా హెల్మెట్ బకల్ కూడా పెట్టుకోవాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారే కాక వారి వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని పిల్లలు సైతం వారికి సరిపోయే హెల్మెట్లను పెట్టుకోవాలని డిజిపి అన్నారు. సీట్ బెల్ట్  ధరించి పరిసరాలను గమనిస్తూ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలన్నారు. వాహనంలో సీట్ బెల్ట్ ధరించకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యే అవకాశం లేదన్నారు. 

కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి సజ్జనార్ మాట్లాడుతూ... డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నిర్దేశించిన అవగాహన కార్యక్రమం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బాధితుల సంస్మరణ దినం సందర్భంగా భారీ స్థాయిలో ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాదులో ప్రారంభిస్తున్న  అవగాహన కార్యక్రమం డిజిపి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడతారన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే దాదాపు లక్షల 70 వేల మంది మరణిస్తున్నారని , పలువురు గాయపడుతున్నారని వెల్లడించారు. హెల్మెట్ లేకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని త్వరలో హైదరాబాద్ పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారే కాక  ఇతరులకు  కూడా నష్టం చేస్తారన్నారు. దేశవ్యాప్తంగా జీవన దానం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా అమలవుతుందని తద్వారా కొంతమంది జీవితాల నైనా కాపాడవచ్చునే అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సహాయపడే వారిని గుడ్ సమారిటన్ పేరుతో సత్కరించనున్నామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన సినిమా రంగానికి చెందిన వారికి, వైద్య రంగానికి చెందిన వారికి, ప్రజలకు పోలీస్ కమిషనర్ కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని స్మరిస్తూ కార్యక్రమంలో రెండు నిమిషాలు పాటించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శ్రీ జోయల్ డేవిస్ కోరారు. Toofan E Paper 15th Nov 2025

 బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడని సినీ నటుడు శ్రీ బాబు మోహన్  తన ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచర నటుడు శ్రీ కోట శ్రీనివాస రావు కుమారుడు కూడా కూడా రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయాడని, తాము ఇద్దరం ఎప్పుడూ కలిసినా ఆ విషయం మాట్లాడుకుని బాధ పడేవాళ్ళ మని విచారం వెలిబుచ్చారు. సినీ నటుడు శర్వానంద్ మాట్లాడుతూ... ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుల కోసమేనని ,అవి పోలీసుల కోసం కాదని ప్రజలందరూ వాటిని పాటించి బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై పాటలతో కూడిన దృశ్యాలను డిజిపి ఆవిష్కరించారు.  ఐజిపిలు డాక్టర్ ఎం.రమేష్, రమేష్ నాయుడు,  శ్రీనివాసులు , డిసిపిలు ఇతర పోలీసు అధికారులు ,సినీ నటుడు ఆది సాయికుమార్ , గాయకుడు నాగూర్ బాబు, గాయని మోహన భోగరాజు, దర్శకుడు బుచ్చిబాబులు, డాక్టర్ రాఘవ దత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొనగా  యాంకర్ సుమ  వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  Toofan E Paper 15th Nov 2025

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి