త్వరలో హైదారాబాదు నగరానికి ఎడీబీ ప్రతినిధి బృందం
*న్యూఢిల్లీ లో ఎడీబీ అధికారులతో మేయర్, ముఖ్య కార్యదర్శుల భేటీ త్వరలో నగరానికి ఎడీబీ ప్రతినిధి బృందం* గ్రేటర్ హైదారాబాదులో మౌలిక సదుపాయాల కల్పన కు ఆర్డిక సహాయాన్ని అందించాలని కోరుతూ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల బృందం న్యూ డిల్లీ లో నేడు ఆసియా అభివృద్ది బ్యాంక్ ఉన్నాతాదికారులను కలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో ప్రధానంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, టీ- ఫైబర్, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ఎస్ఆర్డీపీ తదితర కార్యక్రమాలు ఉన్నాయని ఏడీబీ అడికారులకు వివరించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె టీ ఆర్ ఆదేశాల మేరకు న్యూ డిల్లీ లొని ఆసియా అభివృద్ది బ్యాంకు అధికారులను మేయర్ రామ్మోహన్ తో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యడర్శి అరవింద్ కుమార్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముక్య కార్యదర్శి జయెశ్ రంజన్ లు సమావేశ మయ్యారు. ఎడీబీ న్యూ డిల్లీ మిషన్ డైరెక్టర్ యొకొయమా తో సమాయెశమై తెలంగాణా లో ముక్యంగా గ్రేటర్ ...