ఫార్ములా-ఈ రేస్‌తో గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది: కేటీఆర్
త్వరలో భారతదేశ 'మొబిలిటీ వ్యాలీ'గా హైదరాబాద్ ఆవిర్భావం టీ-హబ్, టీ-వర్క్స్' – తెలంగాణ ఆవిష్కరణలకు జంట స్తంభాలు కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యువత ఉద్యోగాలు, నూతన అవకాశాలను సృష్టించాలి: కేటీఆర్ పిలుపు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు...