Posts

Showing posts with the label #Bastihospitals #Ghmchospitals #Telugunews

అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్

Image
  అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూలై 04(TOOFAN):    అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శుక్రవారం  గ్రేటర్ లో సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మెడికల్ అండ్ హెల్త్, అనుబంధ శాఖల అధికారులతో కమీషనర్ ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్,  సుభద్ర, చీఫ్ మెడికల్  హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్  వెంకన్న, డాక్టర్ ఉమా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్  జె వెంకటేశ్వరరావు, ఐ ఐ సి టి  సైంటిస్ట్ కె.లక్ష్మీ నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ మాట్లాడుతూ... జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో  సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్  వ్యాధుల ...

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

Image
  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి   హైదరాబాద్, జూలై 04(TOOFAN):    తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. దొడ్డి కొమురయ్య 79వ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి, విముక్తి కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాటం మరువలేనిది అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ లు అనురాగ్ జయంతి, రఘు ప్రసాద్, గీతా రాధిక, వేణుగోపాల్, సి.ఈ రత్నాకర్, చీఫ్ అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పైరసీపై కఠిన చర్యలు

Image
  👉 ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు 👉 సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి - ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్, జూలై 3, (TOOFAN): సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫడిసి బోర్డు రూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించామని, సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన కూడా చేస్తామని అయన వెల్లడించారు. ఎఫ్‌డీసీ నోడల్ ఏజెన్సీగా , ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్‌లకు ఆన్లైన్ అనుమతుల ప్రొసెస్‌తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని దిల్ రాజు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్...

రాష్ట్రంలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి..

Image
* సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జ‌యంత్ చౌద‌రి సూచ‌న‌ * ఐటీఐల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని విజ్ఞ‌ప్తి * స్కిల్ యూనివ‌ర్సిటీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరిన సీఎం * ఐటీఐల సిల‌బ‌స్ అప్‌గ్రేడ్‌కు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం  హైద‌రాబాద్‌:  రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువ‌ల్స్ రంగాల‌కు సంబంధించి సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జ‌యంత్ చౌద‌రి సూచించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ఆయ‌న నివాసంలో కేంద్ర మంత్రి జ‌యంత్ చౌద‌రి ఆదివారం స‌మావేశ‌మ‌య్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తాము ప్రారంభించిన‌ యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి.. దానిని ఐటీఐల‌ను అనుసంధానిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంపై ముఖ్య‌మంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్ష‌ణ కింద యంగ్ ఇండియ...

*ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా బ‌స్తీ ద‌వాఖానాలు*

Image
*ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా బ‌స్తీ ద‌వాఖానాలు*    నిరుపేద‌ల‌కు అందిస్తున్న వైద్య ప‌రిక్ష‌ల‌కు గాను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన బ‌స్తీ దవాఖానాలు వైద్య స‌హ‌యానికి వ‌చ్చేవారితో కిట‌కిట‌లాడుతున్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఏర్పాటుచేసిన 18 బ‌స్తీ ద‌వాఖానాల్లో ప్ర‌తిరోజు వంద‌లాది మంది వైద్య చికిత్స‌ల‌కై వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా బి.జె.ఆర్‌న‌గ‌ర్‌, గుడ్డీబౌలి, హ‌షీమాబాద్ బ‌స్తీ ద‌వాఖానాల‌కు ప్ర‌తిరోజు 200ల‌కు పైగా త‌గు వైద్య ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నారంటే బ‌స్తీ దవాఖానాల ప‌ట్ల బ‌స్తీవాసులు క‌ల్పిస్తున్న ఆద‌ర‌ణ‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌త 5 నుండి 10వేల మంది జ‌నాభాకు ఒక బ‌స్తీ దవాఖానాను ఏర్పాటు చేయాల‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ నిర్ణ‌యించిన సంగ‌తి విదిత‌మే. న్యూఢిల్లీలో విజ‌య‌వంతంగా న‌డుస్తున్న మెహ‌ల్లాక్లీనిక్‌ల ప‌నితీరును కూడా మేయ‌ర్ రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో అధికారుల బృందం గ‌తంలో ప‌రిశీలించింది. ఢిల్లీలోని మెహ‌ల్లా క్లీనిక్‌ల మాదిరిగానే న‌గ‌రంలో తొలిద‌శ‌లో బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా 2018 ఏప్రిల్ 6వ తేద...