అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్

 అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్



హైదరాబాద్, జూలై 04(TOOFAN):   అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శుక్రవారం  గ్రేటర్ లో సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మెడికల్ అండ్ హెల్త్, అనుబంధ శాఖల అధికారులతో కమీషనర్ ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్,  సుభద్ర, చీఫ్ మెడికల్  హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్  వెంకన్న, డాక్టర్ ఉమా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్  జె వెంకటేశ్వరరావు, ఐ ఐ సి టి  సైంటిస్ట్ కె.లక్ష్మీ నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ మాట్లాడుతూ... జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో  సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్  వ్యాధుల పట్ల తీసుకున్న చర్యలు వివరించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యమని అన్నారు. వ్యక్తి గత  పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సురక్షిత త్రాగు నీరు ప్రజలు పాటించాలన్నారు. ఇప్పటి వరకు వెక్టార్ బర్న్ వ్యాధులు డెంగ్యూ, మలేరియాతో పాటుగా సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరం, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు  తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో డెంగ్యూ, మలేరియా వ్యాధి బారిన పడకుండా ఫాగింగ్, ఏఎల్ఓ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టినట్టు కమిషనర్ వివరించారు. తీసుకున్న చర్యలపై మరిన్ని చర్యలు సూచనలు, సలహాలు  ఇవ్వాలని సూచించారు. వెక్టార్ బర్న్ వ్యాధి కట్టడికి ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు ఇంటర్ డిపార్ట్మెంట్ సహకారం అవసరం అని అన్నారు. సహాయ మెడికల్ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏ ఎన్ ఎం ఆశా వర్కర్, అంగన్వాడి టీచర్ తో పాటు స్వయం సహాయక సంఘం గ్రూప్ ఎడ్ సభ్యులు ఉంటారు వారందరూ ఐఈసి కార్యక్రమాలు చేస్తారని గ్రేటర్ లో కూడా అదే పద్ధతిలో నిర్వహించేందుకు చర్యలు  తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. 

హెల్త్ అండ్ శానిటేషన్ మీద సిఎం అండ్ హెచ్ ఓ పద్మజ మాట్లాడుతూ... గ్రేటర్ వెక్టార్ బర్న్, సీజనల్ వ్యాధుల పై జిహెచ్ఎంసి లో చేపట్టిన చర్యలు వివరించారు. 

ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ మాట్లాడుతూ... అర్బన్ మలేరియా క్రింద ఫీవర్ సర్వే, ఏఎల్ఓ,  ఫాగింగ్  కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టినట్లు వివరించారు. శానిటేషన్ రోజుకొక వార్డు, వారంలో వార్డు లో పూర్తి చేసారు. అదే విధంగా దోమల నివారణకు ఫాగింగ్ రోజుకు ఒక వార్డు చొప్పున 150 వార్డులలో చేస్తున్నట్లు ఈ ఫాగింగ్ ప్రక్రియను వారం రోజుల్లో వార్డ్ వార్డులో పూర్తి చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఏఎల్ఓ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టినట్లు కళాశాల, హై స్కూల్ విద్యార్థులకు ఐఇసి కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం హెచ్ ఓ వివరించారు. 

జాతీయ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు,  డెంగ్యూ, మలేరియా వ్యాధి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలో వివరించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ పై డాక్టర్ బాలాజీ  జాయింట్ డైరెక్టర్ సీజనల్ వ్యాధుల పై వివరించారు. విక్టర్ బర్న్ డిసీజెస్,  ప్రివెన్షన్ ట్రీట్మెంట్, కంట్రోల్ చేసే పద్ధతులు పై  ఉస్మానియా యూనివర్సిటీ ఎంటమాలజి విభాగం ప్రొఫెసర్  జె వెంకటేశ్వరరావు, అవగాహన కల్పించారు. టెక్నాలజీ ప్రకారంగా దోమల బెడద, వ్యాధులు ప్రబలిన ప్రాంతాలను గుర్తించి నివారించవచ్చునన్నారు. లేక్స్ హై చిన్ నివారణ పై  పద్దతులు  ఐ ఐ సి టి సైంటిస్ట్ కె. లక్ష్మీ నారాయణ రాజు  లేక్స్  రెస్టోరేషన్, వాటర్ హ్యాచిన్ పై  దోమల నివారణ పద్దతులను వివరించారు. గుర్రపు డెక్క ను తొలగించి బయటకు తొలగించకుండా అక్కడే వెయ్యి గజల్లో ఎరువు గా మార్చుకోవచ్చునని అన్నారు.

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ... హైదరాబాద్ లో సెప్టెంబర్ మాసం ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదు అవుతుందని, యాంటీ లార్వా ప్రోగ్రామ్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని, మెడికల్ జీహెచ్ఎంసి సంయుక్తంగా బృందాలుగా ఏర్పరిచి యాంటీ లార్వా ప్రోగ్రాంలను చేస్తున్నట్టు హైదరాబాద్ జిల్లాలో కేసులు నమోదు అవుతుందని ఐఇసి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని,  ప్రతి స్కూల్  డెంగ్యూ వ్యాధి నివారణకు ఆవాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఏటా కేసులు పెరుగుతున్నాయని ఒక్కొక ఏరియా ఒక్కొక్క సంవత్సరం కేసులు నమోదు ఆ స్కూల్ లతో పాటుగా  సినిమా థియేటర్లు, మార్కెట్ లో జిహెచ్ఎంసి తో  ఏ ఎన్ ఎం లు ఆశా వర్కర్లు, ఎంటమాలజి సిబ్బంది కలిసికట్టుగా నివారణ కార్యక్రమంలో చేపడుతున్నట్లు వివరించారు.

మేడ్చల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా మాట్లాడుతూ... రాపిడ్ ఎమర్జెన్సీ లోను హైరిస్క్రియలో ఏర్పాటు చేశామని  జిహెచ్ఎంసి తో కలిసి యాక్టర్ బోర్న్ వ్యాధులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని అందుకోసం క్రియేటివ్ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, డంపింగ్ ఏరియా, వాటర్ లాగిన్ పాయింట్లు గుర్తించి అక్కడ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి