Posts

Showing posts with the label telangana news

త్వరలో నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్

Image
త్వరలో  నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్ కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ, గారి  చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్   డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా   యాత్రికులకు  అందుబాటులోకి  తీసుకు  రావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు నర్సాపూర్  ఎకో పార్క్లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పి.పి.పి   మోడ్ లో అటవీ శాఖ మరియు ప్రైవేట్ యాజమాన్య సహకారంతో నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.   నర్సాపూర్  ఎకో పార్క్  ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడ చక్కని ప్రాంతంగా వెలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు.  ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు  సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకోపార్క్ ...

Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి

Image
Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి - మొక్కజొన్న, జొన్న పంటలను PSSలో చేర్చాలి - కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య ఆర్థిక విధానం అవసరం - ఆయిల్ పామ్ తో పాటు పత్తి రైతులపై ప్రభావం చూపుతున్న కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాలు - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి లేఖ రాసిన మంత్రి తుమ్మల ఈ రోజు “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” మరియు “నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్” పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అభినందననలు తెలియజేస్తూ.. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రిగారు అభినందిస్తూనే, రాష్ట్రంలో అమలవుతున్న PSS పథకంలో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్రం చూపెడుతున్న నిర్లక్ష్యం మరియు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న కేంద్ర వాణిజ్య విధానాల గురించి లేఖ ద్వారా తెలియజేశారు. Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితి తొలగించాలి : ప్రస్తుతం PSS పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలపై కేంద్రం 25% సీలింగ్ విధించడం వలన, రైతు...

ఫార్ములా-ఈ రేస్‌తో గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది: కేటీఆర్

Image
త్వరలో భారతదేశ 'మొబిలిటీ వ్యాలీ'గా హైదరాబాద్ ఆవిర్భావం టీ-హబ్, టీ-వర్క్స్' – తెలంగాణ ఆవిష్కరణలకు జంట స్తంభాలు కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యువత ఉద్యోగాలు, నూతన అవకాశాలను సృష్టించాలి: కేటీఆర్ పిలుపు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు...

గ్రేటర్ వ్యాప్తంగా 1,166 కాలనీలలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్‌ పూర్తి* GHMC Sanitation Drive

Image
  గ్రేటర్ వ్యాప్తంగా 1,166 కాలనీలలో ప్ రత్యేక సానిటేషన్ డ్రైవ్‌ పూర్తి* 1892 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 655.4 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు తొలగింపు హైదరాబాద్, అక్టోబర్ 10, (Toofan): జీహెచ్ఎంసీ  పరిధిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన తొలగింపు కోసం ప్రత్యేక శుభ్రత డ్రైవ్ ప్రభావవంతంగా కొనసాగుతోంది.  సానిటేషన్ డ్రైవ్ చేపట్టి నేటితో ఐదు రోజులు పూర్తి కాగా ఈ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకూ 150 డివిజన్ ల పరిధిలోనీ 1,166 కాలనీలలో 1892 మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 655 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించడం జరిగింది.  జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్.బి.నగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్లలో వ్యర్థాల సేకరణ సజావుగా జరుగుతోంది. అన్ని సర్కిల్స్‌లో వాహనాల మోహరింపు, వ్యర్థాల సేకరణ, డంపింగ్ ప్రాసెస్‌పై అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ, నగరంలోని పాత వ్యర్థాల తొలగింపుతో పాటు శుభ్రమైన, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణం కు జీహెచ్ఎంసీ యంత్రాంగం, సిబ్...

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం - Crime News Chikkadpally Police Station Hyderabad

Image
 పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రూ.90,800 కోల్పోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.... చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని మంగళ్య షాపింగ్ మాల్ వద్ద నివాసం ఉండే భాగమ్మ రజిత (35) అనే ప్రైవేట్ ఉద్యోగిని జూలై 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి సంబంధించిన పోస్ట్ చూశారు. ఆసక్తితో ఆమె వాట్సాప్ నంబర్ (9341843064) ద్వారా వారిని సంప్రదించారు. మొదట చిన్న చిన్న టాస్క్‌లు చేయించి, ప్రతిఫలంగా ఆమెకు రూ.10 క్రెడిట్ చేసి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత, నిందితులు ఆమెను **'నేషనల్ ఎక్స్ఛేంజ్' (National Exchange)** అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాలని సూచించారు. ఆ గ్రూప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అడిగారు. దీంతో ఆమె జూలై 6న రూ.10,800 నుంచి మొదలుపెట్టి, పలు దఫాలుగా రూ.44,000, రూ.32,000, రూ.4,000 చొప్పున మొత్తం **రూ.90,800...

ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్!

Image
 ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్!   సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్  ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది,దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది,డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్‌లకు ఇవ్వనున్నారు. వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్‌ అందనుంది. ఈ అడ్వాన్స్‌ను తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేయనుంది,ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధి కారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్‌ సూచించారు.కాగా, దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతోంది. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు తోడ్పాటు అంది స్తున్నామని చెప్పగా.. ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు అడ్వాన్స్‌ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

July 12th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 10th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్

Image
  కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్ హైదరాబాద్, కంటోన్మెంట్: కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ అభివృద్ధికి భారీ నిధులను విడుదల చేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో జూబ్లీ బస్ స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూమి బదిలీకి బదులుగా కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకే మళ్లించాలని బోర్డు తీర్మానం చేసినట్లు ఈటల పేర్కొన్నారు. ఈ మేరకు తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాసినట్టు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. ఈ లేఖలు, బోర్డు తీర్మానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర రక్షణ శాఖ తాజాగా రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోకి నేరుగా జమచేసినట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈటల తెలిపారు. అదనంగా రూ.11 కోట్ల గ్రాంట్‌ను కూడా విడుదల చేసినట్టు పేర్కొన్నారు. వర్షపు నీరు, డ్రైనేజ్ కు భారీ ప్రాజెక్టులు ఈ నిధు...

July 4th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 3rd, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
   

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి

Image
 విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి -వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS. పోలీస్‌ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు తెలిపారు. యూనిట్ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం ప్రారంభించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లతో పాటు ఇతర పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గోంటున్న డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో రెండు రోజుల పాటు నిర్వహించబడుతాయి.  ఈ డ్యూటీ మీట్‌ లో పోలీస్‌ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి అధికారులు, సిబ్బందికి డ్యూటీ మీట్‌ ద్వారా తమ ప్రతిభ కనబర్చడం జరుగుతుంది.  ఇందులో భాగంగా కంప్యూటర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌ లిఫ్టింగ్‌, బాంబ్‌  డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోటో మరియు వీడియో గ్రఫీ విభాగాల్లో పోటీలను నిర్విహించబడుతాయి. ఈ పోటీల్లో విభాగాల వారిగా రాణించిన వారిని జోనల్ స్థాయిలో నిర్వహి...

June 17th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్

Image
 ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూన్ 16( TOOFAN ):     ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయరాదని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్  అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలువైపుల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. ప్రజలు విన్నవించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...  గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడానికి, విన్నపం అందజేసిన నేపథ్యంలో అధికారులు కూడా వారి విన్నవించిన సమస్యను బాధ్యత తో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో సంబంధిత హెచ్ఓడి లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యు.బి.డి విభాగం...

తిరుమలాయపాలెం మండలంలో రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన

Image
వారం రోజుల్లో రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అందజేస్తామని రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం గత పాలకుల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బి.టి రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల 15 లక్షలతో బచ్చోడు నుండి ఉర్లగొండ డొంక వరకు , రూ.2 కోట్ల 42 లక్షలతో రాజారాం నుండి జూపెడ వరకు  2.2 కిలోమీటర్ల పొడవు, రూ.కోటి 83 లక్షలతో సోలిపురం నుండి హలావత్ తండా వరకు , రూ.3 కోట్ల 15 లక్షలతో పీక్యా తండా నుండి కాకరవాయి వరకు 3 కిలో మీటర్ల మేర నిర్మించనున్న బి.టి రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.అనంతరం సోలిపురం గ్రామంలో ఉన్న హజ్రత్ మన్సూర్ షావలి దర్గాను దర్శించుకొని చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..4 రోజులలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రస్తుత సీజన్ ముగిసే లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా...