తిరుమలాయపాలెం మండలంలో రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన



🔷వారం రోజుల్లో రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అందజేస్తామని రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం గత పాలకుల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బి.టి రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

🔷రూ.3 కోట్ల 15 లక్షలతో బచ్చోడు నుండి ఉర్లగొండ డొంక వరకు , రూ.2 కోట్ల 42 లక్షలతో రాజారాం నుండి జూపెడ వరకు  2.2 కిలోమీటర్ల పొడవు, రూ.కోటి 83 లక్షలతో సోలిపురం నుండి హలావత్ తండా వరకు , రూ.3 కోట్ల 15 లక్షలతో పీక్యా తండా నుండి కాకరవాయి వరకు 3 కిలో మీటర్ల మేర నిర్మించనున్న బి.టి రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.అనంతరం సోలిపురం గ్రామంలో ఉన్న హజ్రత్ మన్సూర్ షావలి దర్గాను దర్శించుకొని చాదర్ సమర్పించారు.

🔷ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..4 రోజులలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రస్తుత సీజన్ ముగిసే లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి