Posts

Showing posts with the label telugu news

మేడారం మహా జాతర ప్రారంభానికి మరో ఏడు రోజులు

Image
 మేడారం మహా జాతర ప్రారంభానికి మరో ఏడు రోజులు జాతర నిర్వహణలో 50 వేల మంది అధికారులు, సిబ్బంది     ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో వారంరోజులు మాత్రమే ఉండడంతో ఈ జాతర ఏవిధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 28 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు కోటిన్నర కు పైగా మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం చరిత్రలో గతంలో మరెన్నడూ లేని విధంగా 2026 జాతరకు రూ. 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కేటాయించారు. మరో వందేళ్ల వరకు నిలిచిపోయేలా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధికే రూ. 100 కోట్లను కేటాయించి రికార్డు సమయంలో పనులను పూర్తి చేశారు. ఈనెల 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఈ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు.        *జాతర నిర్వహణకు 50,000 మంది అధికారులు, సిబ్బంది *        ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు హాజరవుతా...

బంగారం మొక్కులు.. భక్తిపారవశ్యపు మునకలు: వనదేవతల రాకకు సర్వం సిద్ధం!

Image
 బంగారం మొక్కులు.. భక్తిపారవశ్యపు మునకలు: వనదేవతల రాకకు సర్వం సిద్ధం! సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం         హైదరాబాద్, జనవరి 17(తూఫాన్‌) : తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల  కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది.         అందుబాటులో ఉన్న సమాచారం అనుసరించి, ఈ జాతర యొక్క ప్రాశస్త్య మేమనగా 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాతంలోని పొలవాసను పాలించే ఆదివాసి దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కార...

త్వరలో నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్

Image
త్వరలో  నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్ కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ, గారి  చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్   డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా   యాత్రికులకు  అందుబాటులోకి  తీసుకు  రావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు నర్సాపూర్  ఎకో పార్క్లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పి.పి.పి   మోడ్ లో అటవీ శాఖ మరియు ప్రైవేట్ యాజమాన్య సహకారంతో నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.   నర్సాపూర్  ఎకో పార్క్  ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడ చక్కని ప్రాంతంగా వెలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు.  ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు  సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకోపార్క్ ...

Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి

Image
Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి - మొక్కజొన్న, జొన్న పంటలను PSSలో చేర్చాలి - కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య ఆర్థిక విధానం అవసరం - ఆయిల్ పామ్ తో పాటు పత్తి రైతులపై ప్రభావం చూపుతున్న కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాలు - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి లేఖ రాసిన మంత్రి తుమ్మల ఈ రోజు “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” మరియు “నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్” పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అభినందననలు తెలియజేస్తూ.. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రిగారు అభినందిస్తూనే, రాష్ట్రంలో అమలవుతున్న PSS పథకంలో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్రం చూపెడుతున్న నిర్లక్ష్యం మరియు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న కేంద్ర వాణిజ్య విధానాల గురించి లేఖ ద్వారా తెలియజేశారు. Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితి తొలగించాలి : ప్రస్తుతం PSS పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలపై కేంద్రం 25% సీలింగ్ విధించడం వలన, రైతు...

ఫార్ములా-ఈ రేస్‌తో గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది: కేటీఆర్

Image
త్వరలో భారతదేశ 'మొబిలిటీ వ్యాలీ'గా హైదరాబాద్ ఆవిర్భావం టీ-హబ్, టీ-వర్క్స్' – తెలంగాణ ఆవిష్కరణలకు జంట స్తంభాలు కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యువత ఉద్యోగాలు, నూతన అవకాశాలను సృష్టించాలి: కేటీఆర్ పిలుపు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు...

న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో ఆకట్టుకున్న ప‌ర్యాట‌క శాఖ స్టాల్

Image
న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో ఆకట్టుకున్న ప‌ర్యాట‌క శాఖ స్టాల్ హైదరాబాద్, అక్టోబర్ 10: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన టూరిజం స్టాల్ సందర్శకులను కట్టిపడేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంయుక్తంగా ఈ స్టాల్‌ను ఆవిష్కరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయం, పులుల అభ‌యార‌ణ్యాలు, సోమ‌శిల‌, ల‌క్న‌వ‌రం, నాగ‌ర్జున సాగ‌ర్ బుద్ధ‌వ‌నం, భువ‌న‌గిరి కోట‌, పాండ‌వుల గుట్ట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను న‌రెడ్కో ప్రాప‌ర్టీ షో వేదికగా ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక సంపద, సహజ సౌందర్యాన్ని సమన్వయంగా ప్రదర్శించిన ఈ స్టాల్ ప్రాప‌ర్టీ షోలో ఆకర్షణీయ కేంద్రబిందుగా నిలిచింది. భట్టి విక్రమార్క, కృష్ణారావు స్టాల్‌లోని ఛాయ‌చిత్రాల‌ను తిల‌కించారు. ప‌ర్యాట‌కాన్ని ఆర్థిక వృద్ధి యొక్క కీలక శక్తిగా మార్చాలనే ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబించింది.. ఈ స్టాల్ సందర్శకుల దృష్టిని ఆకర్షించి, తెలంగాణ టూరిజం ఔన్నత్యాన...

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం - Crime News Chikkadpally Police Station Hyderabad

Image
 పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రూ.90,800 కోల్పోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.... చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని మంగళ్య షాపింగ్ మాల్ వద్ద నివాసం ఉండే భాగమ్మ రజిత (35) అనే ప్రైవేట్ ఉద్యోగిని జూలై 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి సంబంధించిన పోస్ట్ చూశారు. ఆసక్తితో ఆమె వాట్సాప్ నంబర్ (9341843064) ద్వారా వారిని సంప్రదించారు. మొదట చిన్న చిన్న టాస్క్‌లు చేయించి, ప్రతిఫలంగా ఆమెకు రూ.10 క్రెడిట్ చేసి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత, నిందితులు ఆమెను **'నేషనల్ ఎక్స్ఛేంజ్' (National Exchange)** అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాలని సూచించారు. ఆ గ్రూప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అడిగారు. దీంతో ఆమె జూలై 6న రూ.10,800 నుంచి మొదలుపెట్టి, పలు దఫాలుగా రూ.44,000, రూ.32,000, రూ.4,000 చొప్పున మొత్తం **రూ.90,800...

ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్!

Image
 ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్!   సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్  ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది,దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది,డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్‌లకు ఇవ్వనున్నారు. వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్‌ అందనుంది. ఈ అడ్వాన్స్‌ను తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేయనుంది,ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధి కారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్‌ సూచించారు.కాగా, దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతోంది. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు తోడ్పాటు అంది స్తున్నామని చెప్పగా.. ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు అడ్వాన్స్‌ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

July 20th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 12th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 10th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 9th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్

Image
  కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్ హైదరాబాద్, కంటోన్మెంట్: కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ అభివృద్ధికి భారీ నిధులను విడుదల చేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో జూబ్లీ బస్ స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూమి బదిలీకి బదులుగా కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకే మళ్లించాలని బోర్డు తీర్మానం చేసినట్లు ఈటల పేర్కొన్నారు. ఈ మేరకు తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాసినట్టు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. ఈ లేఖలు, బోర్డు తీర్మానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర రక్షణ శాఖ తాజాగా రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోకి నేరుగా జమచేసినట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈటల తెలిపారు. అదనంగా రూ.11 కోట్ల గ్రాంట్‌ను కూడా విడుదల చేసినట్టు పేర్కొన్నారు. వర్షపు నీరు, డ్రైనేజ్ కు భారీ ప్రాజెక్టులు ఈ నిధు...

హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా

Image
 హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025, జులై 31 ముస్లిం సమాజంలో అత్యంత పవిత్ర తీర్థయాత్ర అయిన హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రారంభించింది. హజ్‌కు వెళ్లాలని భావిస్తున్న యాత్రికులు  https://hajcommittee.gov.in   పోర్టల్ లేదా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘‘హజ్ సువిధ’’ మొబైల్ అప్లికేషన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. 2025 జులై 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై 31 రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ ఫారాలను సమర్పించే ముందు మార్గనిర్దేశకాలు, విధివిధానాలను పూర్తిగా చదవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీన లేదా అంతకు ముందే జారీ చేసి, 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటయ్యే మెషీన్ చదవగలిగిన అంతర్జాతీయ భారత పాస్‌పోర్టును కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ముందు వారి సన్నద్ధతను పరిగణనలోకి తీసుకోవాలని యాత్రికులకు హజ్ కమిటీ సూచించింది. దురదృష్టవశాత్తూ సంభవించిన మరణం లేదా తీవ్రమైన అన...

July 4th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 3rd, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
   

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి

Image
 విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి -వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS. పోలీస్‌ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు తెలిపారు. యూనిట్ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం ప్రారంభించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లతో పాటు ఇతర పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గోంటున్న డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో రెండు రోజుల పాటు నిర్వహించబడుతాయి.  ఈ డ్యూటీ మీట్‌ లో పోలీస్‌ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి అధికారులు, సిబ్బందికి డ్యూటీ మీట్‌ ద్వారా తమ ప్రతిభ కనబర్చడం జరుగుతుంది.  ఇందులో భాగంగా కంప్యూటర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌ లిఫ్టింగ్‌, బాంబ్‌  డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోటో మరియు వీడియో గ్రఫీ విభాగాల్లో పోటీలను నిర్విహించబడుతాయి. ఈ పోటీల్లో విభాగాల వారిగా రాణించిన వారిని జోనల్ స్థాయిలో నిర్వహి...

June 17th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్

Image
 ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూన్ 16( TOOFAN ):     ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయరాదని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్  అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలువైపుల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. ప్రజలు విన్నవించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...  గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడానికి, విన్నపం అందజేసిన నేపథ్యంలో అధికారులు కూడా వారి విన్నవించిన సమస్యను బాధ్యత తో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో సంబంధిత హెచ్ఓడి లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యు.బి.డి విభాగం...