త్వరలో నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్

త్వరలో  నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్


కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ, గారి  చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్   డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా   యాత్రికులకు  అందుబాటులోకి  తీసుకు  రావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు
నర్సాపూర్  ఎకో పార్క్లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పి.పి.పి   మోడ్ లో అటవీ శాఖ మరియు ప్రైవేట్ యాజమాన్య సహకారంతో నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.  


నర్సాపూర్  ఎకో పార్క్  ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడ చక్కని ప్రాంతంగా వెలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు.  ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు  సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకోపార్క్ సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆ రోజంతా సంతోష దాయకంగా గడుపుతారని మరింత సౌకర్యాలు యాత్రికులకు కల్పించాలని ఉద్దేశంతో  కాటేజీ నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు 

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి