పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....
38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘పుస్తక స్ఫూర్తి’పై మేధోమథనం వచ్చే ఐదేళ్లలో అప్పులు లేని సమాజమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు తూఫాన్(హైదరాబాద్) :- అక్షరం మనిషిని ఆలోచింపజేస్తుందని, పుస్తకం జీవితానికి కొత్త దిశను చూపే దారిదీపమని పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ‘అనిశెట్టి రజిత’ వేదికపై ‘పుస్తక స్ఫూర్తి - పుస్తకం ఒక దారిదీపం’ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని వక్తలను సన్మానించారు. కోటి రూపాయలతో పుస్తకాల పంపిణీ: మంత్రి జూపల్లి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో పఠనాసక్తిని పెంచేందుకు తమ శాఖ తరపున కోటి రూపాయల వ్యయంతో స్ఫూర్తిదాయక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్...