పద్మ పురస్కారాల్లో తెలుగు వెలుగులు.. విజేతలకు రేవంత్ రెడ్డి అభినందనలు
అమెరికా పర్యటన ముగిశాక ప్రభుత్వం తరపున గౌరవ సత్కారం తూఫాన్,హైదరాబాద్ :- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తమ ముద్ర వేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. పద్మశ్రీ విభాగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్ర మౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ ఎంపిక కాగా, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డిలకు ఈ గౌరవం దక్కింది. పశుసంవర్ధక రంగం నుంచి మామిడి రామా రెడ్డి, విద్యా–సాహిత్య రంగాల నుంచి మామిడాల జగదీశ్ కుమార్, వెంపటి శశిశేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రిలు పురస్కార గ్రహీతల జాబితాలో నిలిచారు. కళా రంగం నుంచి దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తమ సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాలను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పురస్కార గ్రహీతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విజేతలు తమ రంగాల్లో అందించిన విశిష్ట సేవలు, అంకితభావమే ఈ ప్రత...