నల్లకుంటలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
- విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ తూఫాన్,హైదరాబాద్:- భారతీయ యువతకు స్ఫూర్తిప్రదాత, యుగపురుషుడు స్వామి వివేకానంద జయంతి వేడుకలు నల్లకుంటలో మంగళవారం మిన్నంటాయి. స్థానిక 'స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్' ఆధ్వర్యంలో స్ఫూర్తి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. వివేకానందుడి బోధనలు నేటి తరం విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. యువత క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. స్థానిక కార్పొరేటర్ అమృత మాట్లాడుతూ.. సేవా దృక్పథంతో స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ ప్రతినిధులు మధుసూదన్ యాదవ్, శిరీష, జోషి, మోహన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. తమ పిల్లలు ప్రతిభ క...