Posts

Showing posts with the label #bjp #municipalelections #Mpeatalarajendar #exministerkrishnayadav #malkajgiri

మున్సిపల్ పోరులో ‘కమల’ జోష్.. యువ, మహిళా మోర్చా భారీ ర్యాలీ

Image
- ముడుచింతలపల్లిలో జెన్-జీ పాదయాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్, సామ రంగారెడ్డి  తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అపూర్వ రీతిలో దూసుకుపోతోంది. సోమవారం మధ్యాహ్నం యువ మోర్చా, మహిళా మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు ‘జెన్-జీ’ (GEN-Z) పాదయాత్ర నిర్వహించారు. లక్ష్మాపూర్, జగన్‌గూడ మరియు ముడుచింతలపల్లి వార్డుల గుండా సాగిన ఈ ప్రచారంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, మేడ్చల్ జిల్లా ప్రభారి సామ రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో మార్పు యువత మరియు మహిళలతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు కల్పిస్తున్న అవకాశాలను, మహిళా సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అభ్యర్థులు నరసింహ గౌడ్, సాయి, ప్రభాకర్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా యువత మరియు మహిళా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వార్డులన్నీ కాష...

వార్డుల్లో 'కమల' ప్రచార హోరు

Image
- ముడుచింతలపల్లిలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన మహిళా శ్రేణులు  తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ తన దూకుడును పెంచింది. మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో 20 మరియు 24 వార్డులలో అభ్యర్థులతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. అభ్యర్థులు మంగ, సత్యనారాయణ గౌడ్ ల గెలుపును కాంక్షిస్తూ కమల దళం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించింది. కేశవరం వార్డులలో ముగిసిన ఈ ప్రచార పర్వం అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌కు మహిళలు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని గాలికొదిలేసిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు. వార్డుల్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ముఖ్యంగా మహిళా లోకం నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే మున...

కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి: కృష్ణ యాదవ్ పిలుపు

Image
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు.. అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో సందడి  తూఫాన్,హైదరాబాద్ :- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తన జోరును పెంచింది. గురువారం ముడుచింతలపల్లి, ఎల్లంపల్లి, మరియు అలీయాబాద్ మున్సిపాలిటీల్లో నిర్వహించిన అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ముడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మద్దతుగా భారీ జనసందోహంతో తరలివచ్చిన శ్రేణుల నినాదాలతో పరిసరాలను హోరెత్తించాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా కృష్ణ యాదవ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా వ్యతిరేక పాలనపై గళమెత్తాలి ఈ సందర్భంగా జరిగిన నాయకుల సమావేశంలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకత్వంలోని వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఓటర్లకు వివరించాలని పార్టీ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులక...