ఆరుట్లలో అంతర్జాతీయ స్థాయి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం
- ప్రభుత్వ బడుల 27 లక్షల మంది విద్యార్థులకు అంకితం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం.. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన సీఎం - రైతు బిడ్డలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం తూఫాన్, హైదరాబాద్ :- రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఆదర్శ పాఠశాల ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించేలా ఈ పాఠశాలను సకల వసతులతో తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం పాఠశాల ఆవరణ అంతా తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఇదే వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం ‘బ్రేక్‌ఫాస్ట్’ (అల్పాహారం) పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటిస్తూ అల్పాహారం తీసుకున్నారు. వంటగదిలో...