Posts

Showing posts with the label #netajisubashchandrabose

నేతాజీ త్యాగం వెలకట్టలేనిది

Image
  సుల్తాన్ షాహీలో ఘనంగా బోస్ జయంతి వేడుకలు నివాళులర్పించిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తూఫాన్,హైదరాబాద్ :- భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 'ఆజాద్ హింద్ ఫౌజ్' స్థాపించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన ధీశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ కొనియాడారు. శుక్రవారం సుల్తాన్ షాహీ చౌరస్తాలో నేతాజీ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ చిత్రపటానికి కృష్ణ యాదవ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. "చలో ఢిల్లీ" అంటూ దేశం కోసం నేతాజీ చేసిన త్యాగం, ఆయన పరాక్రమం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని నేతాజీ సేవలను గుర్తుచేసుకున్నారు. నాయకులు కన్వీనర్ ప్రవీణ్ కుమార్, పాశం సురేందర్ మరియు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. నేతాజీ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.