చిక్కడపల్లిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
తూఫాన్,హైదరాబాద్ :- దేశ యువతకు స్ఫూర్తిప్రదాత, భారతీయుల ఆత్మగౌరవాన్ని ప్రపంచ చాటిచెప్పిన యుగపురుషుడు స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) వేడుకలు చిక్కడపల్లిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. గోపాల్ చిక్కడపల్లి తన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టి. గోపాల్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద కేవలం ఒక సన్యాసి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. యువత ఆయన బోధనలను స్ఫూర్తిగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వానీశ్వర శాస్త్రి, దోనేటి సత్యం, గోవర్ధన్, నాగేశ్వరరావు, ప్రసాద్, సురేష్ పలువురు బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని స్వామి వివేకానంద చేసిన సేవలను స్మరించుకున్నారు.