Posts

Showing posts with the label #Basthi Dawakhanas #GHMcbasthidawakhanas #Ministerktr #Laxmanreddy

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

Image
  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి   హైదరాబాద్, జూలై 04(TOOFAN):    తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. దొడ్డి కొమురయ్య 79వ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి, విముక్తి కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాటం మరువలేనిది అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ లు అనురాగ్ జయంతి, రఘు ప్రసాద్, గీతా రాధిక, వేణుగోపాల్, సి.ఈ రత్నాకర్, చీఫ్ అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య సంస్క‌ర‌ణ‌లు దేశానికే త‌ల‌మానికం - మంత్రి కేటీఆర్

Image
వైద్య ఆరోగ్య సంస్క‌ర‌ణ‌లు దేశానికే త‌ల‌మానికం - మంత్రి కేటీఆర్ *తెలంగాణ ఆరోగ్య‌శాఖ‌లో గుణాత్మ‌క ప్ర‌గ‌తి* *త్వ‌ర‌లో రాష్ట్రంలో ప్ర‌తి వ్య‌క్తికీ హెల్త్ ప్రొఫైల్‌* *ఇంటింటికీ కంటి, రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు* *గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వెయ్యి బ‌స్తీ ద‌వాఖానాలు*    తెలంగాణ‌లో చేప‌ట్టిన వైద్య ఆరోగ్య సంస్క‌ర‌ణ‌లు దేశానికే త‌ల‌మానిక‌మ‌న్నారు ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు. కెసిఆర్ మార్గ నిర్దేశ‌నంలో, మంత్రి ల‌క్ష్మారెడ్డి చొర‌వ‌తో రాష్ట్ర ఆరోగ్య‌శాఖ గుణాత్మ‌క మార్పులు తీసుక‌వ‌చ్చింద‌న్నారు. నేను రాను బిడ్డో అని పాడుకునే రోజుల నుంచి నేను వ‌స్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు అనే స్థాయిలో ప్ర‌భుత్వ ద‌వాఖానాల వైపు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షితుల‌ను చేయ‌డం సామాన్య విష‌యం కాద‌న్నారు. మ‌ల్కాజీగిరి బి.జె.ఆర్ న‌గర్‌లో వైద్య ఆరోగ్య‌శాఖ‌-గ్రేట‌ర్ హైదారాబాద్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ‌స్తీ దావ‌ఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.ల‌క్ష్మారెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ల‌తో క‌లిసి కెటిఆర్  ప్రారంభించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ...