Posts

Showing posts with the label #Chiefsecretary #TelanganaCheifsecretary #

క్లోజ్ అయిన గనులను పునరుపయోగానికి మార్గం – కిషన్ రెడ్డి

Image
బొగ్గు గనుల మూసివేత అనంతరం  వృక్షసంపద అభివృద్ధికి చర్యలు  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్ శివార్లలోని కాన్హా శాంతివనంలో బొగ్గు, గనుల  శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను అధికారులు వెల్లడించగా.. ఇకపై చేపట్టాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు.  మైనింగ్ కు సంబంధించిన పలు అంశాలను కూడా లెవనెత్తారు. వీటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అధికారులు సమాధానం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చొరవతీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను సభ్యులందరూ ప్రశంసించారు. మైన్ క్లోజర్ సందర్భంగా.. మైనింగ్ కోసం భూములిచ్చి ఉద్యోగాలు పొందిన వారికి మళ్లీ ఉపాధి కల్పించడం, తదితర అంశాలను సభ్యులు లేవనెత్తారు. దీనిపై దృష్టిసారిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటుగా, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కిషన...

పురోగ‌తిలో కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పోర్టల్ లో పెండింగ్ ప‌నులు

Image
పురోగ‌తిలో కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్  గ్రూప్ పోర్టల్ లో  పెండింగ్ ప‌నులు కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్  గ్రూప్ పోర్టల్ లో  పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సి.యస్ అధ్యక్షతన  11 వ Project Monitoring Group  సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరి శ్రీ అరుణ్ గోయల్, జాయింట్ సెక్రటరి శ్రీ సోమదత్ శర్మ, R&B ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీ శ్రీధర్, మెట్రోరైల్ ఎండి శ్రీ NVS రెడ్డి, పరిశ్రమల శాఖ కమీషనర్ శ్రీ నదీమ్ అహ్మద్,  అడిషనల్ పిసిసిఎప్ శ్రీమతి శోభ, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ మెట్రోరైల్, సింగరేణికి సంబంధించి పనులను సమీక్షిస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర అధికారులు పేర్కొన...