పురోగతిలో కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పోర్టల్ లో పెండింగ్ పనులు
పురోగతిలో కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పోర్టల్ లో పెండింగ్ పనులు
కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సి.యస్ అధ్యక్షతన 11 వ Project Monitoring Group సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరి శ్రీ అరుణ్ గోయల్, జాయింట్ సెక్రటరి శ్రీ సోమదత్ శర్మ, R&B ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీ శ్రీధర్, మెట్రోరైల్ ఎండి శ్రీ NVS రెడ్డి, పరిశ్రమల శాఖ కమీషనర్ శ్రీ నదీమ్ అహ్మద్, అడిషనల్ పిసిసిఎప్ శ్రీమతి శోభ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ మెట్రోరైల్, సింగరేణికి సంబంధించి పనులను సమీక్షిస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర అధికారులు పేర్కొన్నారని సి.యస్ వివరించారు.
హైదరాబాద్ మెట్రోరైల్ కు సంబంధించి 215 ఆస్తుల సేకరణకు గాను 29 ఆస్తులను demolish చేయడమైనదని 186 ప్రాపర్టీలు అవార్డ్ స్టేజ్ లో ఉన్నాయని జూన్ 15 నాటికి అప్పగిస్తామని తెలిపామన్నారు.
సింగరేణికి సంబంధించి ఖమ్మంజిల్లాలో కిష్టాపురం కోల్ మైన్ కు 85 హెక్టార్లకు అటవీ అనుమతి స్టేజ్-1 క్లియరెన్స్ ఇవ్వాలని కోరామన్నారు. ప్రయివేట్ భూములకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపామని సి.యస్ పేర్కొన్నారు. మైనింగ్ పనులను సత్వరమే ప్రారంభించటానికి కృషి చేస్తున్నామన్నారు.
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మునీరాబాద్-మహబూబ్ నగర్, మనోహరాబాద్-కొత్తపల్లి, కొవ్వూరు-భద్రాచలం పనులకు సంబంధించి భూసేకరణ పురోగతిని తెలిపామన్నారు.
జాతీయ రహదారులకు సంబంధించి సంగారెడ్డి-అకోలా (NH161), హైదరాబాద్ – మన్నెగూడ (NH-163), మంచిర్యాల-చంద్రాపూర్ (NH-363), జగిత్యాల - వరంగల్(NH-563), కోదాడ – ఖమ్మం (NH365 A), సూర్యాపేట – ఖమ్మం(NH-365BB), ఖమ్మం-అశ్వరావుపేట (NH365BB) ప్యాకేజిల వారిగా భూసేకరణను పూర్తి చేస్తున్నామన్నారు.
భూసేకరణపై జిల్లా కలెక్టర్లతో నిత్యం సమీక్షిస్తున్నామని, కేంద్ర అధికారులకు తెలిపినట్లు సి.యస్. వివరించారు.
Comments
Post a Comment