సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

        హైదరాబాద్, జూన్ 16 (TOOFAN):: సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా సి.హెచ్. ప్రియాంకా నేడు భాద్యతలు స్వీకరించారు. శాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎం.డి గా బదిలీచేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గాఉన్న సి.హెచ్. ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నేడు ఉదయం సచివాలయంలో డా, హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తోపాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. గా భాద్యతలను స్వీకరించారు. 
         స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎం.డి గా వెళ్లిన డా. హరీష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. 

Comments

Popular posts from this blog

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి