Posts

Showing posts with the label #Yvschowdhary #Tollywood #Tollwood2018

కొత్త హీరో హీరోయిన్లను కనిపెట్టే సెల్యులాయిడ్ సైన్స్సిస్ట్ వై వి యస్ చౌదరి

Image
కొత్త హీరో హీరోయిన్లను కనిపెట్టే సెల్యులాయిడ్ సైన్స్సిస్ట్ వై వి యస్ చౌదరి   యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి స్క్రీన్ నేమ్ వై వి యస్ చౌదరి, మే 23 న పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్  సింహావలోకనం చేసుకుంటే... విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు  నందమూరి తారక రామరావు వీర అభిమాని అయినా అతను ఆ మహానటుడి తేజోరూపం పట్ల  ఆకర్షితుడై తెలుగు సినీ రంగం లోకి ప్రవేశించి ఓ గొప్ప  దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మరియు ప్రదర్శన దారుడిగా ఈనాడు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలపెట్టుకున్నాడు వై వి యస్ చౌదరి. తన అభిమాన నటుడు యన్టీర్ ను మాస్ హీరోగా ఎలివేట్ చేసిన కె.రాఘవేంద్ర రావు వద్ద  శిష్యరికం చేసాడు.  తన గురువు లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు, వై వి యస్ చౌదరి పుట్టిన తేదీ మే 23 ఒకే రోజు కావటం ఒక విశేషమైతే, పాటల చిత్రీకరణ లో, హీరోయిన్లను గ్లామర్ గా  చూపించడం లో ఇద్దరికి సామీప్యత ఉండడం గమనార్హం. ఇంకా రామ్ గోపాల్ వర్మ, హిందీ దర్శకుడు మహేష్ బట్ మరియు కృష్ణ వంశీ ల వంటి దర్శకుల తో  పనిచేసిన  అనుభవంతో, 1998...