తండ్రి టి.కృష్ణ భావాలను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ : మంత్రి దేవినేని
తండ్రి టి.కృష్ణ భావాలను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ :మంత్రి దేవినేని ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. ఎన్నో హిట్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై అభిరుచి గల నిర్మాత కె.కె. రాధామోహన్ 'పంతం' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్నారు. హిట్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జూన్ 21న జరిగింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పంతం' చిత్రం జూలై 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ఎఫ్.డి.సి.చైర్మన్ అంబికా కృష్ణ, దేవినేని అవినాశ్, దేవినేని చందు, ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, గోపీచంద్ మలినేని, రత్నకుమార్, భాస్కర భట్ల, సంపత్ నంది, బాబీ,...