యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుంది
యువత, మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా వేదిక ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దు... ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు “లీడర్” పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్ ను ఆదివారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెల...