Posts

Showing posts with the label #bjp #mpeatalarajendar #exministerkrishnayadav #medchalmalkalgiri #muduchintalapalli

మున్సిపల్ పోరు: పోలింగ్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ ఫోకస్

Image
వార్డు ఇన్‌చార్జులకు రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ దిశానిర్దేశం తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. శుక్రవారం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల ఇన్‌చార్జులతో రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజున అనుసరించాల్సిన మేనేజ్‌మెంట్ వ్యూహాలు, ఓటర్ల అనుసంధానం మరియు బూత్ స్థాయి పర్యవేక్షణపై నాయకులకు కీలక సూచనలు చేశారు.  ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, పోలింగ్ రోజున ప్రతి ఓటు బీజేపీకి పడేలా వార్డు ఇన్‌చార్జులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి బీజేపీ సిద్ధంగా ఉందనే నమ్మకాన్ని ఓటర్లలో కలిగించాలని పిలుపునిచ్చారు. 24 వార్డుల్లోనూ పకడ్బందీగా పోలింగ్...

పోతారంలో ‘కమల’ శంఖారావం.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం

Image
 ముడుచింతలపల్లి ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ధీమా తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పోతారం వార్డులో భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. మున్సిపల్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ ప్రచార పర్వానికి మహిళా నాయకులు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మరియు కృష్ణ యాదవ్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించడంతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని వారు ఉద్ఘాటించారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా ...

మున్సిపల్ పీఠమే లక్ష్యం.. శ్రేణులకు ఈటల దిశానిర్దేశం

Image
ముడుచింతలపల్లిలో బీజేపీ ఎన్నికల సమరశంఖం.. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుకు పిలుపు తూఫాన్,హైదరాబాద్ :- మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. మంగళవారం సాయంత్రం ముడుచింతలపల్లి మున్సిపాలిటీలోని పార్టీ కార్యాలయంలో కీలక ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ హాజరై అభ్యర్థులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న సర్కార్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచిం...