మహావీర్ అహింసా మార్గం మానవాళికి ఆదర్శం
- రామ్ నగర్‌లో ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు - బండారు దత్తాత్రేయ ఘన నివాళులు తూఫాన్, హైదరాబాద్ :- జైనిజం 24వ తీర్థంకరుడైన మహావీర్ జయంతి వేడుకలు మంగళవారం హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని, మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి సందేశం సదాస్మరణీయం ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహావీర్ బోధించిన అహింస, సత్యం, కరుణ అనే సిద్ధాంతాలు కాలాతీతమైనవని కొనియాడారు. లోకకల్యాణం కోసం ఆయన చూపిన మార్గం నేటికీ మానవాళిని సరైన దిశలో నడిపిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మహావీర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, జైన సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.