Posts

Showing posts with the label crime news

July 30th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థ బలోపేతానికి డీజీపీ కార్యాలయంలో సమీక్ష: సమన్వయానికి కొత్త మార్గదర్శకాలు

Image
 డిజిపి  కార్యాలయంలో ఖైదీల ఎస్కార్ట్ పై గురువారం నాడు ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన మార్గదర్శకాలను  శాంతి భద్రతల అదనపు డిజిపి  మహేష్ ఎం. భగవత్ జారీ చేశారు. నూరు శాతం  ఖైదీల ఎస్కార్ట్ ను సమర్ధంగా చేసిన  వారిని వ్యక్తిగతంగా అభినందించారు.  ఇతర రాష్ట్రాలతో సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్కార్ట్ అభ్యర్థనల కోసం రేడియో సందేశాలు కనీసం ఒక వారం ముందే పంపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది మెరుగైన ప్రణాళికకు దోహదపడుతూ, చివరి నిమిషపు లాజిస్టికల్ సమస్యలను నివారించగలదని అన్నారు. అన్ని సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం, లా అండ్ ఆర్డర్, సి ఏ ఆర్, జైళ్లు, కోర్టు అనుసంధానం విభాగాల అధికారులతో కలిసి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఖైదీల ఎస్స్కార్టు తేదీలు, సమయాలు, ఎస్కార్ట్ ఏర్పాట్లపై తక్షణ సమాచారం మార్పిడి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో బయట ఖైదీ ఎస్కార్ట్ శాతం తక్కువగా ఉండే యూనిట్లపట్ల ఆందోళన వ్యక్తం చేసి...

నల్లగొండలో డిప్యూటీ తహశీల్దార్ అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

Image
 నల్లగొండలో డిప్యూటీ తహశీల్దార్ అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నల్లగొండ, జూలై 7: జిల్లాలోని పౌర సరఫరాల శాఖకు చెందిన మిర్యాలగూడ విభాగంలో పని చేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాజా వివరాల ప్రకారం, స్వాధీనపరచుకున్న మూడు వాహనాలపై పంచనామా నిర్వహించి, గౌరవ న్యాయస్థానానికి నివేదిక పంపించి వాటి విడుదల కోసం ఉత్తర్వులు తీసుకొచ్చేందుకు సంబంధించి, ఫిర్యాదుదారు సహాయాన్ని కోరాడు.  అయితే, ఈ పని చేసేందుకు మొదట రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేసిన షేక్ జావీద్, తర్వాత చర్చల అనంతరం దాన్ని రూ. 70,000/- కు తగ్గించాడు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు ACBను ఆశ్రయించగా, అధికారులు 07.06.2025న లంచం స్వీకరిస్తున్న సమయంలో షేక్ జావీద్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతని నివాసంలో మరియు కార్యాలయంలో శోధనలు నిర్వహించినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్ విధించారు. రాష్ట్రంలో అధికారుల అవినీతి అడ్డుకునేందుకు ACB చర్యలు కొనసాగిస్...