Posts

Showing posts from February, 2026

March 1st, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

గ్రామీణ వృత్తులకు మహర్దశ: 530 మందికి ఆధునిక యంత్రాల పంపిణీ!

Image
గ్రామీణ వృత్తులకు మహర్దశ: 530 మందికి ఆధునిక యంత్రాల పంపిణీ! ● స్వయం ఉపాధితోనే దేశాభివృద్ధి.. సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ● 2,384 ప్రాజెక్టులకు రూ. 73.58 కోట్ల మార్జిన్ మనీ విడుదల (సికింద్రాబాద్ - తూఫాన్ బ్యూరో): గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. శనివారం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్రామోద్యోగ వికాస్ యోజన'లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు యంత్రాలు, టూల్‌కిట్లు అందజేశారు. మొత్తం 530 మంది కళాకారులకు కుట్టు మిషన్లు, మట్టి పనులు, చెప్పుల తయారీ, అగరబత్తి తయారీ తదితర వృత్తులకు సంబంధించిన 496 ఆధునిక పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "ఖాదీ ఫర్ నేషన్ - ఖాదీ ఫర్ ఫ్యాషన్" నినాదంతో స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ద్వారా వలసలు తగ్గుతాయని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆకాంక్షించారు. దేశవ్యాప్త...

February 28th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 27th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 26th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 25th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 24th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

ముగిసిన ఖేల్ మహోత్సవం.. విజేతలకు బహుమతుల ప్రదానం

Image
 - జింఖానాలో క్రీడా సంబరాలు.. హాజరైన విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తూఫాన్,హైదరాబాద్ :- సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన 'పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం' మెగా క్రీడా పండుగ ఆదివారం ఘనంగా ముగిసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ముగింపు వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ ఖేల్ మహోత్సవం అద్భుతమైన వేదికగా నిలిచిందని కొనియాడారు. గల్లీ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంలో ఈ పోటీలు ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు కూడా తోడ్పడతాయని, క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మెగా స్పోర్ట్స్ ఫెస్ట...

February 22nd, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 21st, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

శివాజీ స్ఫూర్తితో సాగాలి.. బాగ్ అంబర్‌పేట్‌లో కాషాయ రెపరెపలు

Image
 - ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. బైక్ ర్యాలీలో పాల్గొన్న గౌతమ్ రావు, కృష్ణ యాదవ్ తూఫాన్,హైదరాబాద్ :- బాగ్ అంబర్‌పేట్ డివిజన్ యువమోర్చా ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. యువమోర్చా డివిజన్ అధ్యక్షుడు రఘుచారి నేతృత్వంలో పోచమ్మ బస్తీలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, బస్తీలో ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. హైందవ ధర్మ రక్షణకు, స్వరాజ్య స్థాపనకు శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు శివాజీ మహారాజ్ జైకారాలతో హోరెత్తించారు. కాషాయ జెండాలతో సాగిన ఈ ప్రదర్శన స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ వ...

February 20th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 19th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 18th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 17th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

సంజీవయ్య ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం

Image
- నేక్లెస్ రోడ్డులో మాజీ ముఖ్యమంత్రికి బండారు దత్తాత్రేయ ఘన నివాళి తూఫాన్,హైదరాబాద్ :- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కార్మిక పక్షపాతి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో ఉన్న ఆయన మెమోరియల్ వద్ద హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులు అర్పించారు. సాధారణ కుటుంబంలో జన్మించి, నీతి, నిజాయితీ, స్వయంకృషితో అత్యున్నత పదవులను అధిరోహించిన సంజీవయ్య జీవితం నేటి యువతకు ఆదర్శమని దత్తాత్రేయ కొనియాడారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య, సామాజిక న్యాయం కోసం నిరంతరం తపించారని గుర్తుచేశారు. భూసంస్కరణల అమలులో, వెనుకబడిన వర్గాల అభివృద్ధిలో ఆయన ముద్ర చెరిపివేయలేనిదని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా దత్తాత్రేయ స్మరించుకున్నారు. సంజీవయ్య అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన విలువలను కాపాడుకోవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

February 15th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 14th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 13th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

దయానంద సరస్వతి ఆశయాలు యువతకు ఆదర్శం

Image
- స్వామీజీ జయంతి సందర్బంగా బండారు దత్తాత్రేయ నివాళి.. సామాజిక చైతన్యానికి పిలుపు  తూఫాన్,హైదరాబాద్ :-  ఆర్యసమాజ స్థాపకులు, మహోన్నత సంఘ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి 202వ జయంతి వేడుకలు గురువారం రాంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్వామీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత సమాజాన్ని అజ్ఞానం నుంచి జ్ఞాన మార్గంలో నడిపించిన మహానుభావుడు దయానంద సరస్వతి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘వేదాలకు తరలండి’ అనే పిలుపుతో సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత స్వామీజీకే దక్కుతుందని పేర్కొన్నారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం మరియు జాతీయ చైతన్యం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు. దేశభక్తి, ధర్మం, నైతిక విలువలను ప్రజల్లో నాటిన ఆయన ఆశయాలను నేటి యువత ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. స్వామీజీ చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

ఐడీపీఎల్ కార్మికుడి నుంచి ‘బీఎంఎస్’ జాతీయ అధ్యక్షుడి వరకు..

Image
మల్లేశం కృషి అమోఘం: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసలు తూఫాన్,హైదరాబాద్ :- భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సుంకరి మల్లేశం కు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో దత్తాత్రేయను మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లేశంను సత్కరించిన దత్తాత్రేయ, ఆయన నాయకత్వంలో దేశంలోని కార్మిక శక్తి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మల్లేశం ఐడిపిఎల్ (IDPL)లో కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, అంకితభావంతో పనిచేస్తూ నేడు జాతీయ స్థాయి అత్యున్నత పదవికి చేరుకోవడం గర్వకారణమని దత్తాత్రేయ కొనియాడారు. గతంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని గుర్తుచేశారు. తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మల్లేశం సామర్థ్యాన్ని గుర్తించి ఇపిఎఫ్‌ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా నియమించానని, ఆ బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారని దత్తాత్రేయ ప్రశంసించారు. మల్లేశం సారథ్యంలో బిఎంఎస్ మరిన్ని విజయాలు సాధించాలని, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఆయన కోరార...

February 12th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 11th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

స‌మాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం : ఎంపీఆర్‌

Image
- ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులే అంద‌రికి అద‌ర్శం - జర్నలిస్ట్ క‌మిటిని అభినందించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఎం. పరమేశ్వర్ రెడ్డి తూఫాన్,హైదరాబాద్ :- వేగంగా మారుతున్న 22వ శ‌తాబ్ధంలో.. కాలానికి అనుగుణంగా  ప్రజా సమస్యల పరిష్కారంలో అగ్ర‌బాగన నిలిచే  జర్నలిస్టుల పాత్ర  అద్వితీయ‌మ‌ని, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మందముల పరమేశ్వర్ రెడ్డి కోనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్స‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఇటివల ఎన్నికైన‌ ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులు ఎంపీఆర్‌ను  సోమవారంనాడు మర్యాదపూర్వకంగా త‌న‌ను క‌లిసిన క‌మిటి స‌భ్యుల‌ను పేరు పేరునా ప‌లుక‌రిస్తూ వారిని అభినందించారు. కలిశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...  ద‌శాబ్దాలుగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర, వారి క‌`షి మ‌రువ‌లేనిద‌ని, వేల క‌ట్ట‌లేనిద‌ని ఆయ‌న పేర్కోన్నారు.  నేటి త‌రం జ‌ర్న‌లిస్టుల‌కు మీ సీనీయ‌ర్ జ‌ర్న‌లిస్టులంతా అద‌ర్శంగా, అండ‌గా నిలువాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌న్నారు. స‌మాజంలో జ‌రిగే మంచి చేడుల‌పై అవ...

మున్సిపల్ పోరులో ‘కమల’ జోష్.. యువ, మహిళా మోర్చా భారీ ర్యాలీ

Image
- ముడుచింతలపల్లిలో జెన్-జీ పాదయాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్, సామ రంగారెడ్డి  తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అపూర్వ రీతిలో దూసుకుపోతోంది. సోమవారం మధ్యాహ్నం యువ మోర్చా, మహిళా మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు ‘జెన్-జీ’ (GEN-Z) పాదయాత్ర నిర్వహించారు. లక్ష్మాపూర్, జగన్‌గూడ మరియు ముడుచింతలపల్లి వార్డుల గుండా సాగిన ఈ ప్రచారంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, మేడ్చల్ జిల్లా ప్రభారి సామ రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో మార్పు యువత మరియు మహిళలతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు కల్పిస్తున్న అవకాశాలను, మహిళా సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అభ్యర్థులు నరసింహ గౌడ్, సాయి, ప్రభాకర్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా యువత మరియు మహిళా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వార్డులన్నీ కాష...

వార్డుల్లో 'కమల' ప్రచార హోరు

Image
- ముడుచింతలపల్లిలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన మహిళా శ్రేణులు  తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ తన దూకుడును పెంచింది. మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో 20 మరియు 24 వార్డులలో అభ్యర్థులతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. అభ్యర్థులు మంగ, సత్యనారాయణ గౌడ్ ల గెలుపును కాంక్షిస్తూ కమల దళం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించింది. కేశవరం వార్డులలో ముగిసిన ఈ ప్రచార పర్వం అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌కు మహిళలు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని గాలికొదిలేసిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు. వార్డుల్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ముఖ్యంగా మహిళా లోకం నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే మున...

February 10th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

సమాజంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

Image
  సామాజిక సేవల్లో సైతం జర్నలిస్టులు ముందుండాలే ప్రెస్ క్లబ్ కమిటీని అభినందించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ హైదరాబాద్, తూఫాన్ ప్రతినిధి :-  నేటి జీవన విధానంలో కాలం మారుతొంది. వింత పోకడలతో వారి జీవన శైలీ మారుతొంది. ఓ వైపు సాంకేతిక పేరుతో పేరుగుతున్న టెక్నాలజీ... మరో వైపు వీటికి తొడు, సమాజంలో కత్తి మీద సాములా తయారైన పేను మార్పులు.. వెరసీ వీటన్నింటిని తట్టుకొని  సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ కొనియాడారు. సామాజిక రుగ్మతల పరిష్కారం, సేవా కార్యక్రమాలు చేపట్టడంలో జర్నలిస్టులు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారంనాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను కలిసిన జర్నలిస్టుల బృందాన్ని విరాహత్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి జర్నలిస్ట్ తమ సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక బాద్యతగా సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, మూ...

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో పాత్రికేయుల పాత్ర మ‌రువ‌లేనిది

Image
 జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా,అర్హులైన ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకు ప‌ట్టాలు, లేదా ఇళ్లులు ఇప్పించేందుకు క‌`షి చేస్తాన‌ని హ‌మీ ప్రెస్ క్ల‌బ్ నూతన కమిటీకి అభినంద‌న‌లు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హైద‌రాబాద్‌,  తూఫాన్‌ ప్ర‌తినిది :- ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కి వార‌ధిగా ప‌నిచేసే జ‌ర్న‌లిస్టులు నికార్సైన స‌మాజ, ప్ర‌జా సేవ‌కులు అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోనియాడారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు అనేక మంది జ‌ర్న‌లిస్టులు స‌మాజానికి స్పూర్తీగా నిలిచిన ఘ‌ట‌న‌లు కొకోల్ల‌లు అని గుర్తు చేశారు.  ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జ‌ర్నలిస్టులనుద్దేశించి మాట్లాడుతూ... జ‌ర్న‌లిస్ట్స్‌ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయ‌న‌  పేర్కొన్నారు. ఇళ్ల ప‌ట్టాల‌పై కూడా క‌లెక్ట‌ర్ ద‌`ష్టికి తీసుకేళ్లి, అర్హులైన ప్ర‌తి సీనీయ‌ర్ జ‌ర్న‌లిస్టుకు ప‌ట్టాలు, లేదా ఇళ్లులు ఇప్పించేందుకు త‌న వంతు క‌`షి చేస్తాన‌ని ఆయ‌న హ‌మీ ఇచ్చారు. ముఖ్యంగా ఉప్పల్  నియోజకవర్గ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర మ‌రువ‌లేనిద‌ని అన్నారు.  ప్రతి (నిమిషం) స‌మ‌స్య‌పై ప్రజలతో మమేకమై.. వారి స‌మస్యలను అటు అధికార...

బ్రహ్మర్షి గురుదేవుల ఆశీస్సులు తీసుకున్న బండారు దత్తాత్రేయ

Image
బాగ్లింగంపల్లిలో ‘దివ్యోహం’ మహోత్సవం.. ఆధ్యాత్మిక సంగమంలో మాజీ గవర్నర్ తూఫాన్,హైదరాబాద్ :-   నగరంలోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన ‘దివ్యోహం’ దివ్య సిద్ధేశ్వర్ మహోత్సవం - 2026 ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ విశేష కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధగురువార్ సిద్ధేశ్వర్ బ్రహ్మర్షి గురుదేవులను దర్శించుకున్న దత్తాత్రేయ, వారి నుంచి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం గురుదేవులు నిర్వహిస్తున్న ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. బ్రహ్మర్షి గురుదేవుల ప్రవచనాలు భక్తుల్లో కొత్త చైతన్యాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదేవుల అనుగ్రహం పొందారు. ఆధ్యాత్మిక వేడుకలతో బాగ్లింగంపల్లి పరిసర ప్రాంతాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.

February 8th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

మున్సిపల్ పోరు: పోలింగ్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ ఫోకస్

Image
వార్డు ఇన్‌చార్జులకు రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ దిశానిర్దేశం తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. శుక్రవారం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల ఇన్‌చార్జులతో రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజున అనుసరించాల్సిన మేనేజ్‌మెంట్ వ్యూహాలు, ఓటర్ల అనుసంధానం మరియు బూత్ స్థాయి పర్యవేక్షణపై నాయకులకు కీలక సూచనలు చేశారు.  ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, పోలింగ్ రోజున ప్రతి ఓటు బీజేపీకి పడేలా వార్డు ఇన్‌చార్జులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి బీజేపీ సిద్ధంగా ఉందనే నమ్మకాన్ని ఓటర్లలో కలిగించాలని పిలుపునిచ్చారు. 24 వార్డుల్లోనూ పకడ్బందీగా పోలింగ్...

February 7th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

పోతారంలో ‘కమల’ శంఖారావం.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం

Image
 ముడుచింతలపల్లి ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ధీమా తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పోతారం వార్డులో భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. మున్సిపల్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ ప్రచార పర్వానికి మహిళా నాయకులు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మరియు కృష్ణ యాదవ్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించడంతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని వారు ఉద్ఘాటించారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా ...