వార్డుల్లో 'కమల' ప్రచార హోరు

- ముడుచింతలపల్లిలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన మహిళా శ్రేణులు 


తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ తన దూకుడును పెంచింది. మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో 20 మరియు 24 వార్డులలో అభ్యర్థులతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. అభ్యర్థులు మంగ, సత్యనారాయణ గౌడ్ ల గెలుపును కాంక్షిస్తూ కమల దళం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించింది. కేశవరం వార్డులలో ముగిసిన ఈ ప్రచార పర్వం అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌కు మహిళలు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని గాలికొదిలేసిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు. వార్డుల్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ముఖ్యంగా మహిళా లోకం నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, అభ్యర్థులు మంగ, సత్యనారాయణ గౌడ్ తో పాటు బిజెవైఎం, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!