యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!

 

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!

- ‘అన్నగారి’కి ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించాలి: ఆలేరు ఇన్‌ఛార్జ్ రేగు బాలనరసయ్య డిమాండ్

- తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహానీయుడు

యాదగిరిగుట్ట, మే 28 (తూఫాన్ బ్యూరో): తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి ఉత్సవాలు యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగావు. తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రేగు బాలనరసయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రేగు బాలనరసయ్య మాట్లాడుతూ.. నాడు రూ. 2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి అన్నార్తుల ఆకలి తీర్చిన అపర భగీరథుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో పేదలను పీడించిన పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, రైతులకు, గ్రామీణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన ఎన్టీఆర్‌కు అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని తీసుకువచ్చి, సైబరాబాద్‌గా నిర్మించడం వల్లే నేడు లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేడు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణాన్ని చేపడుతూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న జరిగిన మహానాడు వేదికగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలకు ఇచ్చిన హామీని ఈ సందర్భంగా బాలనరసయ్య ప్రశంసించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా, రాబోయే రోజుల్లో పార్టీ పరంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని లోకేష్ ప్రకటించడం హర్షణీయమన్నారు. మహిళా లోకమంతా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మచ్చ నరసింహ గౌడ్, ప్రధాన కార్యదర్శి కళ్లెం బాబురావు గౌడ్, పట్టణ అధ్యక్షుడు చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల శ్రీశైలం యాదవ్, భువనగిరి పార్లమెంటరీ పార్టీ సభ్యుడు గుండా భాస్కర్, నాయకులు సుంచు యాదగిరి, దుర్గపతి కృష్ణ, రాజాసింగ్, సీస రాజు, కుమార్, శేషగిరిరావు, శివరాత్రి కిష్టయ్య, యాదగిరి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....