*నాడొక మురికి కుంట...నేడు అది అందమైన ఉద్యానవనం* *రూ. 6.20కోట్లతో కిషన్‌బాగ్ పార్కు నిర్మాణం* *ప్రారంభించనున్న మంత్రి కె.టి.ఆర్* నాడు అదో మురికి కుంట...నిత్యం దుర్గందం, పిచ్చి మొక్కలతో పందులు, ఇతర జంతువులతో ఉన్న ప్రాంతం...నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కిషన్‌బాగ్ కుంటను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు అందమైన పార్కుగా రూపొందించింది. హైదరాబాద్ పాతబస్తీలో మరిన్ని పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా గ్రీనరిని పెంచేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలో భాగంగా ఖాళీగా ఉన్న స్థలాల్లో పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రాధాన్యతను ఇస్తోంది. దీనిలో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండి మురుగునీరు, పిచ్చి చెట్లతో నిండి ఉండి పరిసర ప్రాంతాలు దుర్గందం, దుర్వాసన, దోమలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు పాతబస్తీ వాసులకు సుందరమైన ఉద్యానవనాన్ని నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకుగాను రూ. 6.20 కోట్లను మంజూరు చేసింది. దీంతో రూ. 5.45 కోట్లతో సివిల్ పనులు, రూ. 35 లక్షలతో గ్రీనరి, మొక్కలు ...