అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెల్లోస్ ' టైటిల్ లాంచ్
అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెల్లోస్ ' టైటిల్ లాంచ్ బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3 గా వస్తున్న చిత్రం "సిల్లీ ఫెల్లోస్". అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది.. ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..."అల్లరి నరేష్ తో నేను తీసిన "సుడిగాడు" పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ మా కాంబినేషన్ "సిల్లి ఫెల్లోస్"తో రిపేట్ అవుతుండడం ఆనందంగా ఉంది. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్సపెక్ట్ చేశారో అదే ఈ సినిమాలో ఉంటుంది. హీరోలు అని కాకుండా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేశారు ఇద్దరూ. ఇంత మంచి నిర్మాతలను ఇచ్చిన వివేక్ గారికి నా కృతఙ్ఞతలు. బ్లూ ప్లానెట్ లో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకు...