Posts

Showing posts with the label #bandarudattatreya #SIR #electioncommissionofindia #telanganaelectioncommission #Survey #ramnagar #musheerabadconstituency

రామ్‌నగర్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ: బండారు దత్తాత్రేయ నివాసంలో బీఎల్‌ఓల సర్వే

Image
తూఫాన్, హైదరాబాద్ :- రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా గురువారం (జూలై 09) హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో రామ్‌నగర్‌లో నివసిస్తున్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసాన్ని అధికారులు సందర్శించారు. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ఎన్యుమరేషన్ (ఓటర్ల గుర్తింపు) ప్రక్రియపై దత్తాత్రేయతో అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా నమోదు, సవరణలకు సంబంధించిన అధికారిక ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆయనకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు వెల్లడించారు.